AP: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పై టిడిపి సీనియర్ నాయకుడు బుద్దా వెంకన్న తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.వైసీపీ నేతలు పేర్ని నాని, కొడాలి నాని, వంశీ, జోగి రమేష్‌లను “సైకోలు”గా అభివర్ణిస్తూ, వారిచేత జగనే మాట్లాడిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఏపీలో పెట్టుబడులు పెట్టడం కోసం ఎంతోమంది ప్రభుత్వంపై నమ్మకంతో వచ్చారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే పెట్టుబడులు రావని నీచంగా వైసీపీ సైకోలు ఆలోచన చేస్తున్నారు.
చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో పెద్ద ఎత్తున పెట్టుబడులను తీసుకువచ్చి నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలను కల్పించాలని ప్రయత్నం చేస్తుండగా జగన్మోహన్ రెడ్డి మాత్రం రాష్ట్రానికి ఏ కంపెనీలు పెట్టుబడులు పెట్టకుండా అల్లర్లు సృష్టిస్తున్నారని, పెట్టుబడులు రాకుండా అడ్డుకుంటున్నారని తెలిపారు.ఎపిలో అల్లర్లు చేసేందుకు వైసిపి కుట్రలు చేస్తోందని టిడిపి నేత బుద్దా వెంకన్న తెలిపారు.
రాష్ట్రంలో శాంతిభద్రతలకు పూర్తిస్థాయిలో విఘాతం కల్పిస్తే పెట్టుబడులు రావని నీచపు ఆలోచనలు వైసిపి నేతలు ఉన్నట్లు ఈయన తెలిపారు. మా నాయకుడు చంద్రబాబు నాయుడు అరగంట సమయం ఇస్తే చాలు మీ సంగతి తేలుస్తాం అంటూ ఈ సందర్భంగా బుద్దా వెంకన్న వైయస్ జగన్మోహన్ రెడ్డి పై అలాగే వైసిపి నాయకులపై చేసిన ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. మరి బుద్ధ వెంకన్న వ్యాఖ్యల పట్ల వైసిపి నేతల కౌంటర్ ఎలా ఉంటుందో తెలియాల్సి ఉంది.
