మునుగోడులో గెలిస్తే బీజేపీకి రెండు ప్రయోజనాలు.. కేసీఆర్ కు షాక్ అంటూ?

తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం మునుగోడు ఉపఎన్నిక హాట్ టాపిక్ అయింది. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచే పార్టీని మునుగోడు ఉపఎన్నికే డిసైడ్ చేయనుందని చాలామంది భావిస్తున్నారు. కాంగ్రెస్ కు రాజీనామా చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీ నుంచి పోటీ చేసి విజయం సాధిస్తే మాత్రం ఆ విజయం చరిత్రలో నిలిచిపోతుందని చెప్పవచ్చు. ఈ ఉపఎన్నిక ద్వారా అధికార పార్టీకి ప్రత్యామ్నాయం బీజేపీ అనే అభిప్రాయాన్ని కలిగించాలని బీజేపీ నేతలు భావిస్తున్నారు.

బీజేపీ ఈ ఉపఎన్నికలో గెలిస్తే బీజేపీ రెండు ప్రయోజనాలను పొందే అవకాశం అయితే ఉంటుంది. ఇప్పటికే బీజేపీ నుంచి పోటీ చేసిన ఈటల రాజేందర్ విజయం సాధించడం అధికార పార్టీ షాక్ కాగా మునుగోడు ఉపఎన్నిక ద్వారా రాబోయే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేది బీజేపీ అనే అభిప్రాయాన్ని ప్రజల్లో కలిగించడం, ఇతర పార్టీలలో ఉన్న అసంతృప్త నేతలను సైతం బీజేపీ వైపుకు ఆకర్షితులు అయ్యేలా చేయడం బీజేపీ టార్గెట్ అని చెప్పవచ్చు.

కాంగ్రెస్ ను వీడిన రాజగోపాల్ రెడ్డిని మాత్రమే నిందించకుండా కోమటిరెడ్డి బ్రదర్స్ ను రేవంత్ రెడ్డి నిందించడంతో కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా పార్టీని విడిచిపెట్టే పరిస్థితి అయితే ఏర్పడింది. కాంగ్రెస్ పార్టీ నేతల వైఖరి వల్ల పార్టీలో ఉన్న ఇతర నేతలు హర్ట్ అవుతున్న పరిస్థితి నెలకొంది. మరోవైపు కాంగ్రెస్, టీ.ఆర్.ఎస్ మునుగోడులో నిలబెట్టాల్సిన అభ్యర్థి విషయంలో తర్జనభర్జన పడుతున్నాయి.

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని ఓడించే బలమైన నేత దొరకడం కష్టమేనని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణ రాజకీయాల్లో ఎలాంటి మలుపులు చోటు చేసుకుంటాయో తెలియాల్సి ఉంది. అధికార పార్టీపై ప్రజల్లో కొంతమేర వ్యతిరేకత అయితే ఉంది. అయితే మునుగోడు ఉపఎన్నికలో, రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచే విధంగా కేసీఆర్ వ్యూహాలు ఉండబోతున్నాయని బోగట్టా.