Tollywood : అసలు టాలీవుడ్ సినిమా పరిస్థితి ఒక్క ఆంధ్ర రాష్ట్రానికి వస్తే మాత్రం అయోమయ పరిస్థితిలో ఉన్న సంగతి తెలిసిందే. ఒకపక్క కొత్త కొత్త రూల్స్ కి తగ్గట్టుగా టికెట్ రేట్స్ తో ఒక్కొక్కరికి మతులు పోతున్నాయి. మరి ఈ తంతు అంతా కొన్ని నెలల పాటు కూడా నడుస్తూనే వస్తుంది. ఎట్టకేలకు కోర్టు నుంచే ఏపీ ప్రభుత్వానికి దెబ్బ పడగా మళ్ళీ దాన్ని రివర్స్ లో థియేటర్స్ పై రైడ్స్ లా సంచలన నిర్ణయం తీసుకున్నారు.
ఆల్రెడీ “పుష్ప” లాంటి సినిమాకి ఈ టికెట్ రేట్స్ తో చాలా దెబ్బ పడింది. ఇక ఈ రేట్లుతో థియేటర్స్ నడపలేం మళ్ళీ ఏపీలో పెద్ద ఎత్తున స్వీయ మూసివేత చేస్తున్నారు. ఆల్రెడీ నిన్ననే ఏపీలో కృష్ణ జిల్లాలో పది థియేటర్స్ సీజ్ చేసారని వచ్చిన వార్త సంచలనం రేపగా ఇప్పుడు ఈరోజు గోదావరి జిల్లాల్లో ఏకంగా 50 థియేటర్స్ వారు కొంతకాలం పాటు తమ థియేటర్స్ మూసేస్తున్నాం అని నిర్ణయం తీసుకున్నారట.
ఈ టికెట్ ధరలతో థియేటర్స్ నడుపుకోలేం అని వారు చెప్తున్నా మాట అంట. ఇక ఇదే కానీ “RRR”, “రాధే శ్యామ్” లాంటి సినిమాలకు కూడా కొనసాగినట్టయితే వాటికి కూడా పెద్ద దెబ్బ తప్పదని చెప్పాలి. మరి భవిష్యత్తులో న్యాయబద్ధంగానే ఏమన్నా పరిష్కారం దీనికి దక్కుతుందో లేదో చూడాలి. అలానే ఇంకో పక్క రాష్ట్రంలో ఏ సమస్యా లేనట్టు తెలుగు సినిమా మీదే ఎందుకు పడ్డారా అని చిత్ర పరిశ్రమ అభిమానులు అసహనం వ్యకతం చేస్తున్నారు.