మనలో విటమిన్ సి లోపిస్తే..ఈ వ్యాధులతో పోరాటం చేయాల్సిందే?

మన శరీరంలో విటమిన్ సి ఇమ్యూనిటీ బూస్టర్ గా పనిచేసి అన్ని అవయవాల జీవక్రియలను సమన్వయపరచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. మన రోజువారీ జీవక్రియలకు అవసరమైన విటమిన్-సి మోతాదు వివరాలు చూసినట్లయితే పురుషులకు 90 మి.గ్రా, మహిళలకు 75 మి.గ్రా,గర్భిణీ స్త్రీలకు 85, మి.గ్రా, పాలిచ్చే తల్లులకు 120 మి.గ్రా ప్రతిరోజూ మనం తీసుకునే ఆహారంలో విటమిన్ సి మోతాదు తప్పనిసరిగా ఉండాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

మన శరీరంలో విటమిన్ సి పుష్కలంగా ఉంటే కలిగే ఉపయోగాలు లోపిస్తే కలిగే దుష్పరిణామాలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం. విటమిన్ సి న్యూట్రోఫిల్స్ అంటే తెల్ల రక్త కణాల పెరుగుదలకు సహాయపడుతుంది.కావున మన శరీరకణాల్లోనీ అనేక ఇన్ఫెక్షన్లతో సమర్థవంతంగా పోరాడి రోగ నిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. రక్తంలో హిమోగ్లోబిన్ అభివృద్ధికి సహాయపడే ఐరన్ ను వినియోగించడంలో విటమిన్ సి ఉపయోగపడుతుంది. అదే విటమిన్ సి లోపిస్తే ప్రమాదకర రక్తహీనత సమస్య , చిగుళ్ల నుంచి రక్తస్రావం కావడం, గాయాలు త్వరగా మానకపోవడం, దంతక్షయం జీవక్రియ రేటు తగ్గడం వంటి సమస్యలతో సతమతం అవ్వాల్సి ఉంటుంది.

కరోనా వంటి మహమ్మారిని ఎదుర్కోవాలంటే విటమిన్ సి ఆవశ్యకత ఏంటో మనందరికీ తెలిసిందే. విటమిన్ సి లోపిస్తే మెదడు పనితీరుపై తీవ్ర ప్రభావం ఉంటుంది.
తీవ్రమైన శ్వాసకోశ ఇన్ఫెక్షన్లను నివారించడంతోపాటు టిబి చికిత్సలో విటమిన్ సి ప్రయోజనకరంగా ఉంటుందని ఎన్నో పరిశోధనలు సూచించాయి. ఈ మధ్యకాలంలో విటమిన్ సి టాబ్లెట్లు,టానిక్ రూపంలో అందుబాటులో ఉన్నాయి. అయితే సహజంగా సిట్రస్ ఫలాల్లో లభించే విటమిన్ సి ని తీసుకోవడం వల్లే మంచి ఫలితం ఉంటుందని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

ముఖ్యంగా ఆహార పదార్థాలను ఎక్కువగా వేడి చేస్తే అందులో పుష్కలంగా ఉండే విటమిన్ సి నశిస్తుంది. అలాగే విటమిన్ సి మూలకం మన శరీరంలో నిల్వ
ఉండదు.కావున ప్రతిరోజు విటమిన్ సి పుష్కలంగా ఉండే కూరగాయలు, పండ్లు ఎక్కువగా తీసుకోవడం మంచిది.నారింజ,బత్తాయి, కివి,జామ, యాపిల్,బ్రోకలీ, స్ట్రాబెర్రీ, ద్రాక్ష,ఉసిరి వంటి పండ్లను ఆహారంగా తీసుకోవడం వల్ల మన శరీరానికి అవసరమైన విటమిన్ సి సమృద్ధిగా లభిస్తుంది.

ఇన్ని ప్రయోజనాలు ఉన్న విటమిన్ సి మూలకాన్ని మోతాదుకు మించి తీసుకుంటే మన శరీరంలో వ్యతిరేక ప్రభావాన్ని చూపిస్తుంది. ముఖ్యంగా మన శరీరంలో మోతాదుకు మించి ఐరన్ నిల్వలు పెరిగి వాంతులు, విరోచనాలు, గుండెల్లో మంట, తలనొప్పి నిద్రలేమి సమస్యలు వంటి తీవ్రమైన అనారోగ్య సమస్యలతో బాధపడాలి.