Health Tips:పిల్లలు అనారోగ్య సమస్యలు బారిన పడకుండా ఉండాలంటే ఈ ఆహార పదార్థాలు తప్పక తినిపించాలి..!

Health Tips: సాధారణంగా పెద్దలతో పోలిస్తే పిల్లలలో రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. ఫలితంగా పిల్లలు తరచూ అనారోగ్య సమస్యలకు గురవుతుంటారు. పిల్లల ఆరోగ్యానికి తల్లిదండ్రులు చాలా శ్రద్ద వహిస్తారు. వారికి ఏం తినిపించాలి, ఎటువంటి ఆహరం పెడితే బలంగా ఉంటారు అని తల్లిదండ్రులు ఆందోళన చెందుతుంటారు. చాలా మంది పిల్లలు ఫుడ్ తినాలన్న, నీరు తాగాలన్న కూడా పిల్లలు చాలా మారం చేస్తుంటారు. పిల్లలకి ఎటువంటి ఆహారం తినిపించాలి అన్నా కూడా తల్లితండ్రులు చాలా ఆపసోపాలు పడుతుంటారు. చిన్న పిల్లల డాక్టర్ల సలహా మేరకు చిన్న పిల్లలకు పోషకాహారం లభించే ఆహారాన్ని పెట్టడం వల్ల వారు చురుకుగా, ఎంతో ఆరోగ్యంగా ఉంటారు.

నిపుణుల అభిప్రాయం ప్రకారం పిల్లలకు ఎక్కువగా ఫ్రూట్స్ పెట్టడం వల్ల వారికి అధిక మొత్తంలో పౌష్టికాహారం లభిస్తుంది. పిల్లలకు ఆరు నెలల కంటే ఎక్కువ వయసు ఉన్నట్లయితే…. వారికి కొన్ని రకాల పండ్లను తినిపించడం వల్ల వారు ఎంతో ఆరోగ్యంగా ఉంటారని నిపుణులు తెలుపుతున్నారు. ముఖ్యంగా పిల్లలకు కివి పండ్లను తినిపించటం వల్ల వారికి అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. పిల్లలు కివి పండ్లను తినటం వల్ల వారు రక్త హీనత సమస్యల బారిన పడకుండా కాపాడుతుంది. కివి పండ్లలో విటమిన్ సి, ఐరన్ సమృద్ధిగా లభిస్తాయి. ఇవే కాకుండా ఇతర పోషకాలు కూడా పుష్కలంగా లభిస్తాయి. పిల్లల ఆరోగ్యానికి కివి పండ్లు ఎంతో మేలు కలుగజేస్తాయి, అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం….

• పిల్లలులు తరచుగా దగ్గు, జలుబు సమస్యలతో బాధపడుతుంటారు. రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండటం వల్ల వారు ఈ సమస్యలతో బాధపడుతుంటారు. రోగ నిరోధక శక్తి అధికంగా ఉండటం వల్ల పిల్లలు రోగాల బారిన పడకుండా కాపాడుతుంది. కివి లో ఉండే పోషక విలువలు పిల్లలలో రోగనిరోధకశక్తిని మెరుగుపరుస్తుంది.

• కివి లో ఫైబర్ లభిస్తుంది. తరచూ కివి పండ్లు తినడం వల్ల మలబద్దకం సమస్యలు దూరమవుతాయి. మలబద్దక సమస్యతో బాధపడే పిల్లలు ఎక్కువగా ఆహారాన్ని తినడానికి ఇష్టపడరు. పిల్లలకు క్రమం తప్పకుండా కివి పండ్లను తినిపించడం వల్ల జీర్ణ సమస్యలు తగ్గడమే కాకుండా, ఇతర ఆరోగ్య సమస్యల బారిన కూడా పడకుండా ఉండవచ్చు.

• కివి లో ఐరన్ అధికంగా లభిస్తుంది. కివి పండ్లను ఎక్కువగా తినటం ఐరన్ లోపం సమస్యలు తగ్గుతాయి.
అయితే వీటిని ఉపయోగించే ముందు ఒకసారి డాక్టర్ సలహా తీసుకుని ఉపయోగించడం మంచిది. ఉదర సమస్యలు, దద్దుర్లు ఇతర ఆరోగ్య సమస్యలతో బాధపడే పిల్లలకు కివి లను దూరంగా ఉంచడమే మంచిది.