టాలీవుడ్ టాప్ దర్శకుడు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ రాసిన ఓ అద్భుతమైన డైలాగ్ ఇప్పుడు గుర్తు తెచ్చుకోవాలి. తన లాస్ట్ సినిమా అల వైకుకుంఠపురములో ఇది ఉంటుంది. ఒక యుద్ధం వచ్చినపుడే తన మన అని బేధం వదిలి అంతా ఒక్కటై యుద్ధం చేస్తారు అని ఇప్పుడు తెలుగు సినిమా దగ్గర అలాంటి పరిస్థితే నెలకొంది. టాలీవుడ్ లో టికెట్ ధరల విషయంలో ఎప్పుడు నుంచో గందరగోళం జరుగుతున్న సంగతి తెలిసిందే. కానీ ఫైనల్ గా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం టికెట్ ధరల పట్ల తమ వైఖరిని కుండ బద్దలు కొట్టినట్టు చెప్పడంతో టాలీవుడ్ హీరోలు పెద్దలు తీసుకునే స్టెప్ ఏమిటీ అనేది ఆసక్తి గా మారింది.
అయితే ఈ సమస్యకి సంబంధించి ఇప్పటికే పవన్ కళ్యాణ్ అనేక సార్లు స్పందించారు. ఇంకా నాని కూడా చాలా మంచి పాయింట్ రైజ్ చేసి మాట్లాడ్డం కూడా జరిగింది. ఓ రకంగా తన టక్ జగదీష్ ఓటిటి లోకి వెళ్ళడానికి కారణం కూడా ఏపీలో టికెట్ ధరలే అని గుర్తుంచుకోవాలి. మరి ఈరోజు మెగాస్టార్ చిరంజీవి కూడా తన స్పందనను తెలియజేసారు. అలాగే యంగ్ హీరో కార్తికేయ కూడా ఓ సందర్భంగా మాట్లాడాడు. అయితే టాలీవుడ్ అంతటికీ పెను ముప్పులా మారిన ఈ సమస్యకి కేవలం ఈ హీరోలు మాత్రమే స్పందించడం గమనార్హం. మిగతా హీరోలు అంతా ఏమైనట్టు?
వాళ్ళు ఉంటుంది టాలీవుడ్ లోనే కదా హద్దు దాటినపుడు తాము కూడా మాట్లాడి తీరాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. అయినా కూడా మన హీరోలు ఇంకా అదే మెతక వైఖరి మనకెందుకు అనే వైఖరిని చూపించడం నిజంగా బాధాకరం. వారంతా వచ్చి మాట్లాడితేనే కదా సినీ పరిశ్రమకి మంచి జరిగేది. కోలీవుడ్ లో కనుక ఇలా జరుగి ఉంటే అందరు స్టార్ హీరోలు ఒకే వేదికపైకి వచ్చిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. కానీ ఇలాంటి యూనిటీ మన దగ్గర హీరోలకి లేకపోవడం ప్రభుత్వాలకు ప్లస్ అయ్యిపోతుంది. అసలు సంబంధమే లేని సినిమా పరిశ్రమలోకి జోక్యం హాస్యాస్పదం. మరి వీటన్నింటినీ మీద ఒక ఫైనల్ ముగింపు రాకపోతే భవిష్యత్తు లో తెలుగు సినిమాకి పెద్ద ఎత్తున నష్టం ఖాయం.