Health Tips: వేసవికాలంలో ఉల్లి చేసే మేలు తెలిస్తే ఆశ్చర్యపోతారు…!

Health Tips: మన భారతీయ వంటింట్లోకి ఉల్లిపాయ తప్పనిసరిగా ఉంటుంది. అన్ని రకాల వంటకాలలో ఉల్లిపాయను ఎక్కువ ఉపయోగిస్తారు.అందువల్ల ఆహారం రుచిగా ఉండటమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. అందుకే ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదు అనే సామెత ఉంది. ఉల్లిపాయ ఆరోగ్యానికి మేలు చేస్తుందని అందరికి తెలిసిన విషయమే,కానీ… వేసవి కాలంలో ఉల్లిపాయ వల్ల ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో చాలా మందికి అవగాహన ఉండదు. వేసవిలో ఉల్లి వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు గురించి తెలుసుకుందాం.

ఉల్లిపాయలో ఆరోగ్యానికి అవసరమైన క్యాల్షియం, మెగ్నీషియం, సోడియం, పొటాషియం, సెలీనియం మరియు ఫాస్పరస్ వంటి పోషకాలు ఎక్కువగా ఉంటాయి. ఉల్లి లో ఉండే యాంటీబ్యాక్టీరియల్ లక్షణాలు అనేక వ్యాధుల నుండి ఉపశమనం కలిగిస్తాయి. ముఖ్యంగా వేసవికాలంలో వచ్చే అధిక దాహం, వడదెబ్బ, నీరసం, అలసట, వంటి అనేక రకాల సమస్యలు ఎదుర్కోవడంలో ఉల్లిపాయ ఎంతో ఉపయోగపడుతుంది.

వేసవి కాలంలో అధిక ఉష్ణోగ్రతల వల్ల జలుబు జ్వరం తలనొప్పి వంటి సమస్యలు ఎక్కువగా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అందువల్ల మనం తీసుకొనే ఆహారంతో పాటు ఉల్లిపాయలు తినడం వల్ల అందులోని యాంటీ ఆక్సిడెంట్స్ ఈ ఆరోగ్య సమస్యలు తగ్గించడంలో ఉపయోగపడతాయి. అంతేకాకుండా ఫ్రీ రాడికల్స్ సమస్యల నుండి శరీరాన్ని కాపాడుతాయి.

వేసవి కాలంలో అధిక ఉష్ణోగ్రత వల్ల శరీర ఉష్ణోగ్రత పెరిగి చాలామందికి ముక్కు నుండి రక్తస్రావం జరుగుతుంది. అటువంటి సమయంలో పచ్చి ఉల్లిపాయను తినడం లేదా ముక్కు వద్ద ఉంచి వాసన చూడటం వల్ల ఆ సమస్య తగ్గుతుంది.