అచ్చెన్న- – జేసీ లకి జైల్లో కరోనా రావడం వెనక ఇంత కథ ఉందా??

రాజకీయాల్లో ఆరోపణలు సహజం. ఆధారాలు లేకపోయినా రాజకీయ నాయకులు నోటికి వచ్చినట్టు వాగుతూ ఉంటారు. రాష్ట్రంలో గాని దేశంలో గాని ఏ తప్పు జరిగినా అప్పుడు అధికారంలో ఉన్న నాయకుడిని, పార్టీని నిందించడం ప్రతిపక్ష నాయకులకు అలవాటు.

AP Ex minister Acchen Naidu

కొన్నిసార్లు ప్రకృతి వైపరీత్యాలకు కూడా తెలివి తక్కువ నాయకులు అధికార పక్షాన్ని నిందిస్తారు. ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్న సంఘటనలు చూస్తుంటే ఆరోపణలు చేయడానికి కారణాలు అవసరం లేదని తెలుస్తుంది. 2019 ఎన్నికల్లో ఓడిపోయిన తరువాత చంద్రబాబు నాయుడు వైసీపీ ప్రభుత్వాన్ని అడుగడున తిడుతూనే ఉన్నారు. అడ్డుపడుతూనే ఉన్నారు. అయితే ఇప్పుడు కొంతమంది రాజకీయనేతలకు కరోనా రావడానికి కూడా సీఎం జగన్ మోహన్ రెడ్డి కారణమని వ్యాఖ్యానించారు.

మొన్న అచ్చెన్నాయుడు నేడు జేసీ ప్రభాకర్ రెడ్డికి కరోనా అంటించారని మండిపడ్డారు. ఇద్దరు నేతలకు వైరస్.. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే సోకిందని విమర్శించారు. ఇందులో ప్రభుత్వ దురుద్దేశం దాగి ఉందన్నారు. ఇక నారా లోకేష్ బాబు కూడా ఇదే విషయంపై స్పందించారు. జేసీ ప్రభాకర్ రెడ్డి గారు బెయిల్ పై రిలీజ్ అయ్యిన 24 గంటల్లోనే మరో కేసు అంటూ మళ్ళీ అరెస్ట్ చేసారు. ఆయన కడప జైలులో కరోనా బారిన పడటం బాధాకరమన్నారు. జేసీ ప్రభాకర్ రెడ్డికి మెరుగైన వైద్యం అందించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం వారిని అరెస్ట్ చేయడం వెనక కుట్ర ఉందని చెప్తే ఎవరికైనా నమ్మడానికి బాగుంటుంది. కానీ కరోనా రావటానికి కూడా ప్రభుత్వం కుట్ర పన్నిందని చెప్తూ టీడీపీ నాయకులు ట్రోల్ మెటీరియల్ గా మారుతున్నారు.

అచ్చెన్నాయుడు, జేసీ ప్రభాకర్ రెడ్డి స్కాంలలో తప్పు చేశారనే ఆరోపణలు రావడంతో విచారణను ఎదుర్కొంటూ జైలుకు వెళ్లారు. కానీ దీనికి వైఎస్ జగన్ ప్రభుత్వానికి ముడిపెట్టడం దారుణమని వైసీపీ శ్రేణులు మండిపడుతున్నాయి. తప్పులు చేసి జైలుకెళితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏమీ చేస్తుందని ప్రశ్నిస్తున్నారు. ఒక్కప్పుడు తప్పును నిరూపించాడనికి తెలివితేటలు అవసరం ఉండేది కానీ ఇప్పుడు ఆరోపణలు చేయడానికి కూడా కనీసం తెలివితేటలు ఉండాలని టీడీపీ నేతలు నిరూపించారని టీడీపీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు.