మొన్న రాహుల్ గాంధీ, ఇప్పుడు అమిత్ షా.! తర్వాత ఎవరు.?

Then Rahul : తెలంగాణ రాష్ట్రానికి కొద్ది రోజుల వ్యవధిలో ఢిల్లీ నుంచి ఇద్దరు అతిథులు వచ్చారు. ఒకరు కాంగ్రెస్ ముఖ్య నేత, ఇంకొకరు బీజేపీ ముఖ్య నేత. కాంగ్రెస్ ముఖ్య నేత, భావి ప్రధాని రాహుల్ గాంధీ ఇటీవల తెలంగాణక వచ్చి, రైతుల కోసమంటూ ఓ డిక్లరేషన్ ప్రకటించి వెళ్ళిన సంగతి తెలిసిందే. రాహుల్ రాకతో తెలంగాణ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి.

కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం కనిపించింది.
ఇంతలోనే, తెలంగాణకు ఇంకో అతిథి వచ్చారు. ఈయన బీజేపీ ముఖ్య నేత, కేంద్ర మంత్రి అమిత్ షా. అమిత్ షా రాకతో, తెలంగాణలో రాజకీయ వాతావరణం ఇంకాస్త ఎక్కువ వేడెక్కింది.

అమిత్ షా పేల్చబోయే రాజకీయ బాంబులెలా వుంటాయి.? అన్నదానిపై జరిగిన రాజకీయ రచ్చ అంతా ఇంతా కాదు.
ఇంతకీ, ఇద్దరు జాతీయ నాయకులు.. రెండు వేర్వేరు పార్టీలకు చెందిన కీలక నేతలు, తెలంగాణకు రావడం వల్ల తెలంగాణ రాష్ట్రానికి ఒరిగేదేంటి.?

ఇదే ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర సమితి సంధిస్తున్న ప్రశ్న. కాంగ్రెస్ హయాంలోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యింది.. అదీ బీజేపీ, పార్లమెంటులో మద్దతివ్వడం వల్లనే.

సో, అలా కాంగ్రెస్ పార్టీకీ, భారతీయ జనతా పార్టీకీ తెలంగాణతో విడదీయరాని అనుబంధం వుందన్నది కాంగ్రెస్, బీజేపీ నేతలు చెప్పే మాట. అంతేనా.? ప్రస్తుతం అధికారంలో వున్న బీజేపీ, తెలంగాణకు అదనంగా చేసేది ఏమన్నా వుందా.?

ఈ ప్రశ్న గులాబీ శ్రేణుల నుంచి వస్తోంది. బీజేపీ నుంచి మాత్రం సరైన సమాధానమే రావడంలేదు. మొన్న రాహుల్, నేడు అమిత్ షా.. ఆ తర్వాత ఎవరు.?