బిగ్ బాస్ రియాల్టీ షో తెలుగు సీజన్ 5 విషయానికొస్తే, చిత్ర విచిత్రంగా కనిపిస్తోంది కంటెస్టెంట్ల తీరు బిగ్ హౌస్‌లో. సుదీర్ఘమైన నామినేషన్ల ప్రక్రియ.. సుదీర్ఘమైన టాస్కులు.. ఇవేవీ వీక్షకులకు ‘కిక్కు’ ఇవ్వలేకపోతున్నాయి. ‘పెళ్ళి తంతు’కి సంబంధించి తాజాగా నడిచిన టాస్క్ చాలా డల్లుగా సాగింది. అసలెందుకు అంత ఓవరాక్టింగ్ చేస్తున్నారు.? అన్న చర్చ బిగ్ బాస్ వీక్షకుల్లో వ్యక్తమవుతోంది. మరోపక్క, ఈ సీజన్ వరకూ యాంకర్ రవి చాలా అనుమానాస్పదంగా కనిపిస్తున్నాడు. కంటెస్టెంట్ల మధ్య పుల్లలు పెట్టడం.. లేదంటే, ట్విస్టింగ్.. ఫ్లిప్పింగ్ వ్యవహారాల కోసమే అతన్ని కంటెస్టెంటుగా సెలక్ట్ చేశారన్నది మెజార్టీ అభిప్రాయం. ‘నో డౌట్, అతను ఎక్కువ రోజులు హౌస్‌లో వుండడు.. హౌస్‌లో హీటు పెరగడం కోసం, కామెడీ పండించడం కోసమే అతనున్నాడు.
గత సీజన్ కోసం అవినాష్ ఎలా అయితే పనికొచ్చాడో, ఇప్పుడు రవి కూడా అంతే..’ అన్న చర్చ సోషల్ మీడియా వేదికగా జరుగుతోంది. రవి నిజానికి గేమ్ ఆడటంలేదు. గేమ్ నడిపిస్తున్నాడు. ఈ వారం ఎలిమినేషన్ కోసం జరిగిన నామినేషన్ ప్రక్రియను పరిశీలిస్తే రవి సెంటరాఫ్ ఎట్రాక్షన్ అయ్యాడు. రవి ముందుగానే ప్రియ మైండ్‌లో లహరి పట్ల నెగెటివిటీని క్రియేట్ చేశాడు. ప్రియ, రవి మాటల్ని నమ్మి.. లహరి మీద చేయకూడని కామెంట్లు చేసింది. తన ప్లాన్ వర్కవుట్ అవడంతో రవి చెలరేగిపోయాడు. ఇదొక్కటే కాదు, చాలా విషయాల్లో రవి.. అందరి చుట్టూ తిరిగేసి నానా గలాటా సృష్టించేస్తున్నాడు. గత సీజన్ విషయానికొస్తే అవినాష్ ఇలాంటివేమీ చేయలేదుగానీ, ఎంటర్టైన్మెంట్ పరంగా చాలా చాలానే చేశాడు. మరీ ముఖ్యంగా అరియానాతో పులిహోర కలిపి సక్సెస్ అయ్యాడు. అదంతా షో కోసం కలిపిన పులిహోర మాత్రమేనని వీక్షకులకు అర్థమవడానికి పెద్దగా సమయం పట్టలేదు. అయితే, అవినాష్ కామెడీ వర్కవుట్ అయ్యింది. కానీ, రవి వ్యవహారమే తేడా కొట్టేస్తోంది.