కరోనా మహమ్మారితో ఆర్నెళ్లుగా మూతపడిన థియేటర్స్ అక్టోబర్ 15 తర్వాత తెరుచుకోనున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే కేంద్రం నుంచి అనుమతి కూడా వచ్చింది. కరోనా నిబంధనలు పాటిస్తూ థియేటర్స్ రీ ఓపెన్ చేయమంటూ అనుమతినిచ్చింది కేంద్రం. ఈ లాక్‌డౌన్ కారణంగా దాదాపు 10 వేల కోట్లు నష్టపోయింది సినిమా ఇండస్ట్రీ.
థియేటర్స్ యాజమాన్యం కూడా వందల కోట్లు నష్టపోయింది. దాంతో ఈ నష్టాలను కాస్తైనా పూడ్చడానికి థియేటర్స్ తెరవాలని నిర్ణయించింది కేంద్రం. ఈ క్రమంలోనే అక్టోబర్ 15 నుంచి దేశవ్యాప్తంగా సినిమా థియేటర్లు 50 శాతం సీటింగ్‌తో తెరుచుకోవచ్చని మార్గదర్శకాల్లో తెలిపింది. దీనికి సంబంధించిన మార్గదర్శకాలను కేంద్ర ప్రభుత్వం జారీ చేసింది.
అన్‌లాక్ 5.0లో భాగంగా థియేటర్లు ఓపెన్ కానున్నాయని కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ తెలిపారు. ప్రజలు ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని కేంద్రం విడుదల చేసిన మార్గదర్శకాలను తప్పకుండా పాటించాలని ఆయన సూచించారు. మరి కేంద్రం జారీ చేసిన ఆ మార్గదర్శకాలు ఏంటనేది చూద్దాం..
1).థియేటర్లలోకి 50 శాతం ప్రేక్షకులను మాత్రమే అనుమతించాలి.. ఇది ముందు నుంచి చెప్పిన మాటే..
2).థియేటర్లలో భౌతిక దూరం పాటించడం తప్పనిసరి.. ఎందుకంటే కరోనా రాకుండా ఇది కూడా ఓ మార్గమే..
3).ఖాళీగా వదిలేసిన సీట్లపై మార్కింగ్ వేయాలి.. అంటే క్యాన్సిల్ మార్క్ పెట్టాలన్నమాట..
4).థర్మల్ స్క్రీనింగ్ చేసిన తర్వాతే లోపలికి అనుమతించాలి.. అలా చేసిన తర్వాతే లోపలికి అనుమతించాలి..
5).శానిటైజర్లు అందుబాటులో ఉంచాలి.. అవి లేకుండా ఏం చేయకూడదు..
6).అందరూ ఆరోగ్యసేతు యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకునేలా చర్యలు తీసుకోవాలి.. దానివల్ల చుట్టూ ఉన్న ఏరియా పరిస్థితి తెలుస్తుంది..
7).టికెట్ కౌంటర్ల వద్ద, థియేటర్ పరిసరాల్లో, లోపల ఎప్పటికప్పుడు శానిటైజ్ చేయాలి..
8).థియేటర్లలో ప్యాకేజ్ ఫుడ్ మాత్రమే అనుమతించాలి.. ఓపెన్ ఫుడ్ తింటే దాని నుంచి కూడా కరోనా వ్యాప్తి చెందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి..
9).ఏసీ టెంపరేచర్ 23 డిగ్రీలపైన ఉండాలి.. ఏసీ నుంచి కూడా కరోనా వస్తుందనే వార్తలు ఉన్నాయి..
10).ఎక్కువగా ఆన్‌లైన్ పేమెంట్‌కే ప్రాధాన్యత ఇవ్వాలి.. డబ్బుల నుంచి కూడా కరోనా సోకే ప్రమాదం లేకపోలేదు..