Mla Car Fire: తాజాగా చండీగఢ్ లో నిజంగా ఒక ఎమ్మెల్యే వాహనానికి ఒక వ్యక్తి పెట్రోల్ పోసి నిప్పంటించాడు. గుర్తు తెలియని యువకుడు ఎమ్మెల్యే వాహనానికి అర్ధరాత్రివేళ నిప్పంటించిన ఘటన హర్యానాలో చోటుచేసుకుంది. ఎమ్మెల్యే నివాసం వద్ద అర్ధరాత్రి 12 గంటల సమయంలో ఒక వ్యక్తి కారు పై పెట్రోల్ పోసి తగలబెట్టాడు. అందుకు సంబంధించిన దృశ్యాలు అక్కడే ఉన్న సీసీ టీవీ కెమెరాలో రికార్డు అయ్యాయి. పానిపట్ బిజెపి ఎమ్మెల్యే ప్రమోద్ కుమార్ విజ్ మంగళవారం హర్యానా మంత్రివర్గ విస్తరణ నేపథ్యంలో చండీఘడ్ కు వచ్చారు. చండీగడ్ ఎమ్మెల్యే నివాస సముదాయంలో టొయోటా ఫార్చునర్ కార్ ను ప్రమోద్ కుమార్ పార్కు చేసి ఉంచారు.
ఇక మంగళవారం రోజు అర్థరాత్రి దాదాపు 12 :10 నిమిషాల సమయంలో ఒక గుర్తు తెలియని వ్యక్తి అక్కడికి వచ్చి కారు పై పెట్రోల్ పోసి నిప్పంటించి పరారయ్యాడు. అయితే కారుకు నిప్పంటించిన సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. అయితే కారుకి నిప్పంటించిన యువకుడు మద్యం మత్తులో ఉండి ఉంటాడు అని పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనలో ముగ్గురికి సంబంధం ఉంది అని భావించి వారి ముగ్గురి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
Unknown persons set white color SUV of Panipat (urban) BJP MLA, Parmod Vij, on fire at MLA hostel Sector 3, Chandigarh. MLA Hostel is one of the high secure area in the city @iepunjab @IndianExpress pic.twitter.com/KDBJZBgN5v
— saurabh prashar (@saurabhprashar2) December 29, 2021
ఇక సీసీటీవీలో రికార్డ్ అయిన దృశ్యాలు ప్రకారం కారుకు నిప్పంటించిన వ్యక్తి నలుపు రంగు ప్యాంటు నీలం రంగు జాకెట్టు ధరించి, ముఖానికి మాస్క్ వేసుకున్నాడు. అయితే ఇనుప రాడ్ తో కారు అద్దాలు పగలగొట్టి, అనంతరం పెట్రోల్ కారు ముందు భాగంలో పోసి నిప్పంటించాడు. ఈ ఘటనకు సంబంధించి దృశ్యాలు సిసిటీవీ లో రికార్డ్ అవ్వడంతో ఈ ఘటనలో ఉన్న వ్యక్తులను గుర్తుపట్ట గలిగారు. ఇక ప్రస్తుతం ఆ ముగ్గురు నిందితులను పరారీలో ఉన్నట్లు తెలిపారు.