AP: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జెసి ప్రభాకర్ రెడ్డి తరచూ వివాదాలలో నిలుస్తున్నారు అయితే ఇటీవల ఈయన చేస్తున్న వివాదాస్పద వ్యాఖ్యలపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేసిన ఐ డోంట్ కేర్ అనే రేంజ్ లోనే ఈయన మాత్రం తన పద్ధతి మార్చుకోకుండా బహిరంగంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు.
ఉచిత ఇసుక విధానంలో కానీ నూతన మద్యం పాలసీలో గాని ఎవరు ఎలాంటి అక్రమాలకు పాల్పడకూడదని చంద్రబాబు నాయుడు చెబుతున్న కొంతమంది సీనియర్ నేతలు మాత్రం చంద్రబాబు నాయుడు చెప్పే మాటలను పెడచెవిన పెట్టారని తెలుస్తుంది. ముఖ్యంగా మద్యం దుకాణాలలో నేతలు కమిషన్లు అడగకూడదని చంద్రబాబు నాయుడు వార్నింగ్ ఇచ్చారు. కానీ జెసి ప్రభాకర్ రెడ్డి మాత్రం తప్పనిసరిగా ప్రతి ఒక్క దుకాణంలో నాకు 10 శాతం వాటా ఇవ్వాల్సిందే అంటూ బహిరంగంగా వీడియోలను విడుదల చేశారు.
ఇకపోతే ఇటీవల బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి వర్సెస్ జెసి ప్రభాకర్ రెడ్డి అనే విధంగా వివాదం కొనసాగుతోంది. వీరిద్దరికీ వైట్ యాష్ విషయంలో వివాదం చోటు చేసుకుంది ఆర్టిపీసీ వృధాగా పారబోసే ఈ వైట్ యాష్ ద్వారా రోజుకు రెండు లక్షల రూపాయల వరకు ఆదాయం పొందవచ్చు రూపాయి పెట్టుబడి లేకుండా రెండు లక్షల ఆదాయం రావడంతో ఈ యాష్ కోసం జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి తాడిపత్రి మున్సిపల్ చైర్ పర్సన్ జెసి పోటీపడ్డారు.
ఇక ఈ విషయంలో పెద్ద ఎత్తున వివాదం చోటు చేసుకోవడంతో స్వయంగా చంద్రబాబు నాయుడు చర్చలకు జేసీని ఆహ్వానించడంతో ఆయన మాత్రం తనకు జ్వరంగా ఉంది రాలేనని చెప్పేశారు. ఇలా తండ్రిని ఏమీ అనలేని దుస్థితిలో చంద్రబాబు నాయుడు ఉన్నారు. దీంతో కొడుకు పై ప్రతాపం చూపారని తెలుస్తుంది ఇటీవల అనంతపురం పర్యటనలో భాగంగా తనకు స్వాగతం పలకడానికి వెళ్లిన అస్మిత్ రెడ్డి పై చంద్రబాబు ఫైర్ అయ్యారు. ఇలా చంద్రబాబు నాయుడు వార్నింగ్ ఇచ్చినప్పటికీ ప్రభాకర్ రెడ్డి మాత్రం ఈ మాటలను లెక్క చేయలేదని చెప్పాలి.