ఛార్జింగ్ పెట్టి ఫోన్ మాట్లాడిన యువకుడు.. అంతలోనే అనంతలోకాలకు!

ప్రస్థుతం స్మార్ట్ ఫోన్ల వినియోగం ఎంతగా ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. స్మార్ట్ ఫోన్ వల్ల ఎంత ఉపయోగం ఉందో అంతే ప్రమాదం కూడా ఉంది. ఇక ఫోన్ ఛార్జింగ్ అవుతుండగానే ఫోన్ వాడేవాళ్ళు చాలా ఉన్నారు. ఇది చాలా పెద్ద ప్రమాదమని చెప్పినా కూడా వినకుండా చివరికి ప్రమాదాన్ని కొని తెచ్చుకుంటున్నారు. అలా తాజాగా ఓ యువకుడు ప్రాణాలే కోల్పోయాడు.

అసోంకు చెందిన భాస్కర్ (20) అనే ఎలక్ట్రీషియన్. రెండేళ్ల క్రితం హైదరాబాద్ కు వచ్చి శంకరపల్లిలో నివసిస్తున్నాడు. ఇక ఇతడు సోమవారం రాత్రి తన విధులు పూర్తి చేసుకుని ఇంటికి వచ్చి అర్ధరాత్రి ఫోన్ ఛార్జింగ్ పెట్టి మాట్లాడుతుండగా ఒకేసారి షాక్ కు గురయ్యాడు. వెంటనే అతడి స్నేహితులు సమీప ఆస్పత్రికి తీసుకెళ్లడంతో అప్పటికే మృతి చెందాడని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం పోలీసులు ఈ విషయం గురించి దర్యాప్తు చేస్తున్నారు.