Newborn Kidnap: పసికందును కిడ్నాప్ చేసిన మహిళ.. కారణం తెలిసి షాకైన పోలీసులు..?

Newborn Kidnap: తాజాగా జనవరి 6వ తేదీ కేరళలోని కొట్టాయం మెడికల్ కాలేజ్ హాస్పిటల్ లో మూడు రోజుల పసికందు కిడ్నాప్ అయినా తీవ్ర కలకలం రేపింది. ఈ విషయంపై పోలీసులు విచారించి ఆ పసికందును కిడ్నాప్ చేసిన మహిళలను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఆ కేసు గురించి విచారణ చేపట్టగా అందులో పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆ పసికందును కిడ్నాప్ చేసిన మహిళ పేరు నీతూ. తిరువల్ల కు చెందిన ఆ మహిళ ప్రస్తుతం కలమస్సేరీ లో ఉంటుంది. ఈ జనవరి 6వ తేదీ సాయంత్రం మూడు గంటల సమయంలో ఆమె నర్సులా గెటప్ వేసుకొని హాస్పిటల్ లోకి వచ్చి, ఆ మూడు రోజుల పసికందును ఆరోగ్యాన్ని పరీక్షించే నెపంతో అక్కడినుంచి తీసుకెళ్ళింది.

అయితే పసికందును తీసుకెళ్లే నర్సు ఎంతసేపటికీ రాకపోవడంతో ఆ పసికందు తల్లిదండ్రులకు అనుమానం వచ్చి హాస్పిటల్ యాజమాన్యం ని విచారించగా అసలు ఆమె నర్సే కాదని తెలిసింది. దీంతో ఆ పాప తల్లిదండ్రులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక ఆ పాపను ఎత్తుకెళ్లిన ఆ నర్స్ మొదట లాడ్జికి వెళ్ళింది. ఆ తర్వాత లాడ్జి నుంచి వెళ్లి పోవడానికి ఒక ఆటో మాట్లాడుకునెందుకు బయటకు వచ్చింది. ఈ క్రమంలోనే ఆమెపై ఆటో డ్రైవర్ కు అనుమానం వచ్చింది. అయితే హాస్పిటల్ లో పాప కిడ్నాప్ కు గురైన విషయం అప్పటికే తెలుసుకున్న ఆ ఆటో డ్రైవర్ పోలీసులకు సమాచారాన్ని అందించాడు. ఇలా వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు స్పాట్ కు చేరుకొని ఆమెను అరెస్ట్ చేశారు. ఆ పసికందును తల్లి ఒడికి క్షేమంగా చేర్చారు. ఇక అనంతరం మహిళా పసికందును ఎందుకు కిడ్నాప్ చేసిందో పోలీసులకు వివరించగా ఆ పోలీసులు ఒక్కసారిగా ఆ విషయం తెలుసుకుని షాక్ అయ్యారు.

ఆ మహిళ ఇబ్రహీం అనే వ్యక్తిని బ్లాక్ మెయిల్ చేసేందుకు ఈ పాపను కిడ్నాప్ చేసినట్లు పోలీసులకు తెలిపింది. నీతూ, ఇబ్రహీం గత కొంత కాలంగా సహజీవనం చేస్తున్నారు. ఈ క్రమంలోనే నీతూ రెండు సార్లు గర్భం దాల్చింది. ఆ సమయంలోనే అబ్రహం ఆమెకు మాయమాటలు చెప్పి రెండుసార్లు అబార్షన్ చేయించడమే, ఆమె నుంచి 30 లక్షల డబ్బు, బంగారం తీసుకుని ఆమెను మోసం చేసి మరొక మహిళను పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడ్డాడు. దీంతో అతడిని ఎలాగైనా ఆపాలి అనుకున్నా ఆమె ఆ పసికందును చూపించి నీ వల్లే ఈ పాప పుట్టింది అని ఇబ్రహీం ను బ్లాక్ మెయిల్ చేసి తన డబ్బు బంగారం తిరిగి పొందాలని ఆ పాప ని కిడ్నాప్ చేసినట్లు ఆమె వెల్లడించింది. అంతేకాకుండా నీతూ ఇబ్రహీం మోజులో పడి తన మొదటి భర్తకు కూడా విడాకులు ఇచ్చింది. ఇక పోలీసులు ఇబ్రహీం, నీతూ ని అరెస్ట్ చేశారు.