ఎమ్మెల్సీ కోటాలో మంత్రులైన పిల్లి సుభాస్ చంద్రబోస్, మోపీదేవి వెంకటరమణ రాజ్యసభ సభ్యులుగా ఎన్నికవ్వడంతో ఆ రెండు మంత్రి పదువులు ఖాళీ అయిన సంగతి తెలిసిందే. పిల్లి సుభాష్ డిప్యూటీ సీఎం, రెవెన్యూ శాఖ మంత్రిగా , మోపీదేవి మార్కెటింగ్, రాష్ట్ర పశుసంవర్థక, మత్స్యశాఖ మాత్యులుగా పనిచేసారు. ఇరువురు బీసీ సామాజిక వర్గానికి చెందిన వారే. దీంతో ఆ పదవీ బాధ్యతలు జగన్ ఎరికి అప్పగిస్తారు? అన్న దానిపై సస్పెన్స్ కొనసాగుతోంది. మళ్లీ బీసీ నాయకులకే పట్టం కడతారా? వేరే సామాజిక వర్గానికి చెందిన సీనియర్ నేతల్ని రంగంలోకి దించుతారా? అన్నఅంశం చర్చనీయాశంగా మారింది.
అయితే ఆ రెండు పదవుల్ని బీసీ వర్గానికి కట్టబెడతారని బలమైన సమాచారం అందుతోంది. ఏడాది పాలనలోనే ఈ మార్పు అనివార్యమైంది కాబట్టి బీసీకే ఇవ్వాలని జగన్ నిర్ణయించినట్లు ప్రభుత్వం వర్గాల నుంచి తెలిసింది. ఇక్కడ పదవులు శాశ్వతం కాదని…రెండున్నరేళ్ల తర్వాత మళ్లీ మంత్రి వర్గ విస్తరణ జరుగుతుందని సీఎం జగన్ ముందే చెప్పారు. కాబట్టి రానున్న రోజుల్లో ఎలాగూ విస్తరణ తప్పదు. ఈ నేపథ్యంలోనే మళ్లీ ఆ రెండు పదవులకు బీసీలకే కేటాయించాలని జగన్ డిసైడ్ అయ్యారుట. ఈ నేపథ్యంలో సాక్షి పత్రికలో ఆ విషయాన్ని ఎలాంటి సందేహాలు లేకుండా రివీల్ చేసారు.
దీంతో మిగతా సామాజిక వర్గానికి చెందిన వారెవ్వరు ఆ రెండు పదవులుపై ఆశలు పెట్టుకునే అవకాశం కోల్పోయినట్లు అయింది. అలా ఆశలు పెట్టుకునే ఛాన్స్ ఉంటుందని భావించే తమ పత్రిక ద్వారా రివీల్ చేసినట్లు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇక ఆషాఢ మాసం ముగిసిన తర్వాత శ్రావణ మాసం ప్రారంభం కాగానే విస్తరణ జరగనున్నట్లు తెలుస్తోంది. శ్రావణ మాసం ఈనెల 21 నుంచి ప్రారంభం అవుతుంది. ఈ నేపథ్యంలో 22వ తేదీన కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం కార్యక్రమం ఉంటుందని సమాచారం.