YS Jagan: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. ఏపీ శాసనసభ డిప్యూటీ స్పీకర్ అయినటువంటి రఘురామకృష్ణంరాజు గతంలో జగన్మోహన్ రెడ్డి పై ఉన్న కేసులను బదిలీ చెయ్యాలని , ఆయన బెయిల్ రద్దు విషయంపై కూడా విచారణ జరపాలి అంటూ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.
ఇక ఈ పిటిషన్ విచారణ పలుమార్లు వాయిదా పడుతూ వచ్చింది. ఇక తాజాగా ఈ పిటిషన్ పై జస్టిస్ నాగరత్న, జస్టిస్ సతీష్ చంద్ర శర్మల ధర్మాసనం నేడు విచారణ జరిపారు. ఈ విచారణలో భాగంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అలాగే రఘురామకృష్ణం రాజు తరపున న్యాయమూర్తులు వాదన విన్న తర్వాత జస్టిస్ నాగరత్న జస్టిస్ సతీష్ చంద్ర సంచలన తీర్పును ప్రకటించారు.
జగన్ పై ఉన్న కేసులను బదిలీ చెయ్యాలని రఘురామ కృష్ణం రాజు వేసిన పిటిషన్ ను డిస్మిస్ చేసింది సుప్రీం కోర్టు ఉన్నత న్యాయం స్థానం తీర్పు వెల్లడించింది. ఇలా కోర్టు తీర్పుతో జగన్మోహన్ రెడ్డికి భారీ ఊరట లభించగా రఘురామ కృష్ణంరాజుకు ఊహించని షాక్ తగిలిందని చెప్పాలి. గతంలో ఈయన అక్రమాసుల సంపాదించారంటూ కేసు ఉండడంతో అరెస్టయి 16 నెలల పాటు జైలులో ఉన్న విషయం మనకు తెలిసిందే. జగన్మోహన్ రెడ్డి పై ఉన్న ఈ కేసులను బదిలీ చేయడమే కాకుండా ఆయన బెయిల్ కూడా రద్దు చేయాలి అంటూ ఈయన పిటిషన్ దాఖలు చేశారు.
ఇలా కోర్టు తీర్పుతో రఘురామకృష్ణం రాజు వెనక్కి తగ్గగా జగన్మోహన్ రెడ్డికి కాస్త ఊరట లభించింది. ఇక ఈయన గతంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపీగా గెలిచి అధికారంలో ఉంటూ జగన్మోహన్ రెడ్డికి పూర్తిగా వ్యతిరేకంగా మారారు అయితే ఇటీవల జరిగిన ఎన్నికలలో రఘురామ కృష్ణంరాజు తెలుగుదేశం పార్టీలోకి చేరారు. ఈయన ఉండి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా గెల పొందడమే కాకుండా అనంతరం డిప్యూటీ స్పీకర్ గా కూడా బాధ్యతలు తీసుకున్నారు.
