తన కూతురుని ఆ హీరో తో నటించొద్దన్న స్టార్ డైరెక్టర్

ఒకప్పుడంటే హీరో, డైరెక్టర్ కూతుర్లు సినిమాల్లోకి వచ్చేవారు కాదు. కానీ ఈ మధ్య ట్రెండ్ మారింది. కమల్ హాసన్ కూతుర్లు శృతి, అక్షర హాసన్, శరత్ కుమార్ కూతురు వరలక్ష్మి లాంటి వాళ్ళు నటులుగా మారి తమ తమ టాలెంట్ ను నిరూపించుకున్నారు.

తాజాగా అదే కోవలోకి వచ్చింది స్టార్ డైరెక్టర్ శంకర్ కుమార్తె అదితి. వాస్తవానికి శంకర్ కు తన కుమార్తెను హీరోయిన్ ను చేయటం ఇష్టం లేదని అంటారు. అయితే కూతురు తాను హీరోయిన్ అవుతానని పట్టు పట్టడంతో చివరకు శంకర్ కాదనలేకపోయారు. అదితి నటించిన మొదటి సినిమా ‘విరుమాలై’. ఇందులో హీరో కార్తీ. ఈ సినిమా ప్రేక్షకులను పెద్దగా మెప్పించకపోయినా.. అదితి నటనకు మాత్రం మంచి ప్రశంసలు వచ్చాయి.

ఈ సినిమాలో ఆమె అంద చందాలను నటనను చూసినవారు.. అదితి కి భవిష్యత్తులో స్టార్ హీరోయిన్ లక్షణాలు ఉన్నాయని అనుకున్నారు. ఈ సినిమా ప్రమోషన్లలో అదితి మాట్లాడుతూ తన తండ్రి శంకర్  గురించి ఓ షాకింగ్ విషయం చెప్పింది. ఆయ‌నకు ఇష్టం లేకపోయినా నేను ఇష్టపడడంతోనే నాన్న సినిమాల్లో నటించడానికి ఒప్పుకున్నారని,  అయితే తాను హీరోయిన్‌గా నటించడానికి ఒప్పుకున్నా… తన తండ్రి ఒక్క హీరోతో మాత్రం నటించవద్దని వార్నింగ్‌ ఇచ్చారని కూడా ఆమె బాంబు పేల్చింది.

అదితి ఆ హీరో పేరు మాత్రం చెప్పకపోయినా హీరో శింబు సరసన నటించవద్దని శంకర్ తన కూతురుకి చెప్పారని టాక్ నడుస్తుంది. దీనికి కారణం శింబు గతం లో నడిపిన అఫైర్స్ కారణమని తెలుస్తుంది.