Shimbu: ఏంటీ శింబు ట్రాన్స్ జెండరా… అందుకే పెళ్లి చేసుకోలేదా… కమల్ హాసన్ సంచలన వ్యాఖ్యలు!

Shimbu: కోలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్న వారిలో శింబు ఒకరు. కెరియర్ పరంగా ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్న ఈయన వ్యక్తిగత విషయాల ద్వారా పెద్ద ఎత్తున వార్తల్లో నిలుస్తుంటారు ముఖ్యంగా పెళ్లి వయసు దాటిపోయిన శింబు ఇప్పటివరకు పెళ్లి చేసుకోకుండా ఉన్నారు. అందుకు కారణం ప్రేమ వ్యవహారాలని చెప్పాలి.

పలువురు హీరోయిన్లతో ప్రేమలో పడి పెళ్లి చేసుకోవాలనుకున్న సమయంలో బ్రేకప్ చెప్పుకొని విడిపోయారు. ఇలా ప్రేమ బ్రేకప్ అంటూ కొనసాగిన శింబు ప్రస్తుతం మాత్రం కెరియర్ పై పూర్తిస్థాయిలో దృష్టి సారించారు. అయితే తాజాగా నటుడు శింబు గురించి ప్రముఖ హీరో కమల్ హాసన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హీరో శింబు ఒక ట్రాన్స్ జెండర్ అంటూ ఈయన చేసిన వ్యాఖ్యలు తీవ్రదుమారం రేపుతున్నాయి.

కమల్ హాసన్ వంటి ఒక స్టార్ హీరో శింబు గురించి ఇలా మాట్లాడటం ఏంటి అంటూ అభిమానులు కూడా షాక్ అవుతున్నారు. అయితే కమల్ హాసన్ చెప్పినట్టూ శింబు నిజ జీవితంలో ట్రాన్స్ జెండర్ కాదని తదుపరి ఆయన నటించబోయే సినిమాలో తన పాత్ర గురించి తెలిపారని తెలుస్తోంది.ప్రస్తుతం కమల్ హాసన్ శింబు కాంబోలో థగ్ లైఫ్ మూవీ వస్తున్న సంగతి మనకు తెలిసిందే .ఈ సినిమా రిలీజ్ కి రెడీగా ఉన్న నేపథ్యంలో భారీగా ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు .

ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా కమల్ హాసన్ శింబు తదుపరి చేయబోయే SRT50 సినిమా గురించి మాట్లాడారు. ఈ సినిమాకు దేశింగు పెరియస్వామి దర్శకత్వం వహించగా స్వయంగా శింబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాలో ఈయన ఒక ట్రాన్స్ జెండర్ పాత్రలో నటించబోతున్నారని, ట్రాన్స్ జెండర్ గా ఎలా నటించాలనే విషయాలను తనను అడిగిమరీ తెలుసుకున్నట్టు కమల్ హాసన్ ఈ సందర్భంగా చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.