చాలా రోజుల నుండి వైసీపీ నాయకులు సీఎం జగన్ మోహన్ రెడ్డిపై కొంచెం కోపంగా ఉన్నారు. ఎందుకంటే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తనను కలవడానికి కనీసం వైసీపీ ఎంపీలకు, ఎమ్మెల్యేలకు కూడా అవకాశం ఇవ్వలేదు. ఈ విషయంపై ఒక ఎంపీ మాట్లాడుతూ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలవడానికి ఒక సంవత్సరం నుండి ప్రయత్నిస్తున్నా కూడా అప్పాయింట్మెంట్ ఇవ్వడం లేదని వెల్లడించారు. అయితే ఇప్పుడు అనూహ్యంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సినీ నటుడు అలీని కలవడం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఎమ్మెల్యేలు, ఎంపీలను కూడా కలవని జగన్ అలీని ఎందుకు కలిశారని వైసీపీ వర్గాలు కూడా చర్చించుకుంటున్నారు.
అసలు అలీని జగన్ ఎందుకు కలిశారు?
2019 ఎన్నికల ముందు నటుడు అలీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను కలిశారు. వ్యతిగతంగా కూడా పవన్ కళ్యాణ్, అలీ చాలా సన్నిహితంగా ఉంటారు. ఈ నేపథ్యంలో అందరూ అలీ జనసేనలో చేరుతారని అందరు అనుకున్నారు కానీ అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తూ అలీ వైసీపీలో చేరారు. ఎన్నికల సమయంలో వైసీపీ తరపున ప్రచారం కూడా చేశారు. అయితే ఎన్నికల్లో వైసీపీ గెలిచిన తరువాత తనకు ఏదైనా పదవి ఇస్తారని అలీ ఆశించారు కానీ ఇప్పటి వరకు ఆలీకి ఏ పదవి దక్కలేదు. ఇప్పుడు అలీ జగన్ మోహన్ రెడ్డిని కలిసి ఇదే విషయంపై చర్చించారని రాజకీయ వర్గాలు చెప్తున్నాయి. త్వరలోనే నామినేటెడ్ పదవి ఇస్తానని జగన్ మోహన్ రెడ్డి ఆలీకి హామీ ఇచ్చారని విశ్వసనీయ వర్గాల సమాచారం. అలాగే సినీ ఇండస్ట్రీలో తనపై జరుగుతున్న రాజకీయాల గురించి అలీ జగన్ కు వివరించారని టాక్ నడుస్తుంది.
అలీని ఇండస్ట్రీ దూరం పెట్టిందా!
2019 ఎన్నికల్లో జనసేన తరపున ప్రచారం చేయకుండా వైసీపీ తరపున ప్రచారం చేయడం వల్ల సినీ ఇండస్ట్రీలో అలీని దూరం పెడుతున్నారని, అందుకే ఆయనకు ఇప్పుడు సినిమాల్లో అవకాశాలు రావడం లేదని ఫిల్మ్ నగర్ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఈ విషయాన్ని కూడా అలీ జగన్ మోహన్ రెడ్డికి చెప్పారని తెలుస్తుంది. ఇప్పటికే అలీని అనేక మూవీస్ నుండి తీసేశారని, ఇప్పుడు ఆలీకి కేవలం టివి షోలు మాత్రమే ఉన్నాయని తెలుస్తుంది. మెగా ఫ్యామిలీ అంటే ఇష్టమున్న వాళ్ళు తమ ప్రాజెక్ట్స్ లోని అలీని తీసుకోవడానికి ఇష్టపడటం లేదు. ఈ విషయం తెలుసుకున్న జగన్ ఆలీకి ఏ పదవి ఇస్తారో వేచి చూడాలి.