ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ లో గవర్నర్ హరిచందన్ పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. నిజానికి గవర్నర్ పేరు రాజకీయ పరంగా పెద్దగా వినిపించదు, కానీ ఇప్పుడు ఆయనే కేంద్ర బిందువు అయ్యాడు. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో ప్రభుత్వం మరియు ఎన్నికల కమిషన్ మధ్య నెలకొన్న విభేదాలను పరిష్కరించటానికి గవర్నర్ పెద్దన్న పాత్ర పోషిస్తున్నాడు. అయితే ఈ పంచాయితీలో గవర్నర్ హరిచందన్ ప్రభుత్వము తరుపున వకల్తా పుచ్చుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.
గవర్నర్ రాజ్యాంగాధిపతి. రాజ్యాంగ ఉల్లంఘనలు జరిగితే జోక్యం చేసుకోవాల్సింది ఆయనే. ముఖ్యంగా రెండు రాజ్యాంగ శక్తుల మధ్య విభేదాలు చెలరేగిన నేపథ్యంలో గవర్నర్ కలగచేసుకోవటం సరైన నిర్ణయమే, ఆయనకు అలాంటి అధికారాలు ఉన్నాయి కాబట్టి అటు ప్రభుత్వం కానీ, ఇటు ఎలక్షన్ కమిషనర్ కానీ రాష్ట్రంలో జరుగుతున్నా విషయాలను రాజ్ భవన్ కు వెళ్లి గవర్నర్ కు విన్నవించుకుంటున్నారు. అయితే ఎస్‌ఈసీ అదే పనిగా రాజ్‌భవన్‌కు వెళ్లి వినతులు సమర్పించుకున్నా.. విజ్ఞాపనలు చేసుకున్నా ప్రయోజనం లేకుండా పోయింది. ఎస్‌ఈసీ తన బాధ్యత ప్రకారం.. అన్నీ గవర్నర్‌కు మొరపెట్టుకుంటున్నారు. రాజ్యాంగ పరమైన విషయాల్లో గవర్నర్ ఆదేశాలు కీలకం కాబట్టి.. ఆయన తన వంతు ప్రయత్నాలు తాను చేశారు. కానీ గవర్నర్ మాత్రం ఏం జరిగినా నిమిత్తమాత్రుడైపోయారు.
బెంగాల్, కేరళ వంటి చోట్ల.. ప్రభుత్వంపై నేరుగా విమర్శలు చేస్తున్నారు ఆయా రాష్ట్ర గవర్నర్, కేంద్రానికి ఫిర్యాదులు పంపుతున్నారు. ముఖ్యమంత్రులపై విరుచుకుపడుతున్నారు. వారంతా తమది రాజ్యాంగపరిరక్షణ విధి అని చెబుతున్నారు. ఓ సందర్భంలో బెంగాల్లో అల్‌ఖైదా తీవ్రవాదులు పెరిగిపోయారని ఆ రాష్ట్ర గవర్నర్… నేరుగా ఆరోపించారు. శాంతిభద్రతలు లేవన్నారు. కేరళ గవర్నర్ అయితే అసెంబ్లీ సమావేశాలు పెట్టాలని ప్రభుత్వం పంపిన తీర్మానాలను కూడా తిరస్కరించారు. కానీ ఏపీ గవర్నర్ మాత్రం.. పంచాయతీ ఎన్నికలు పెట్టకుండా.. ఎస్‌ఈసీకి సహకరించకుండా అధికారులు రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడుతున్నా సైలెంట్‌గా ఉండిపోయారు.
బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో గవర్నర్లు సైలెంట్‌గా ఉన్నారంటే అర్థం ఉంది. కానీ ఇతర పార్టీలు అధికారంలో ఉన్న బెంగాల్, కేరళ వంటి రాష్ట్రాల్లో గవర్నర్లు ప్లే చేస్తున్న రోల్ చూసిన తర్వాత.. బీజేపీయేతర పార్టీ అధికారంలో ఉన్న ఆంధ్రలోనూ గవర్నర్లు అలాంటి యాక్టివ్ రోల్ పోషిస్తారని అందరూ అనుకున్నారు. కానీ బీజేపీ అధికారంలో ఉన్న పార్టీ అన్నట్లుగా హరించందన్ ఏం జరిగినా సంబంధం లేనట్లుగా వ్యవహరిస్తున్నారు.
ఎస్‌ఈసీ, ప్రభుత్వం మధ్య గ్యాప్ తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నారన్న ప్రచారాన్ని అధికార పార్టీ వర్గాలు చేస్తున్నాయి. ఇందులో అధికార పార్టీకి మేలు కోసమే గవర్నర్ దిగారని తెలుస్తుంది. మరోపక్క ఆయన ఆర్డినెన్స్‌లు కూడా కోర్టుల్లో నిలవని పరిస్థితి ఉంది. అంత తప్పులు చేయడానికి కూడా గవర్నర్ ఎందుకు సిద్ధపడిపోతున్నారో అర్థం కాని పరిస్థితి. తాజాగా.. ఎస్‌ఈసీ ఇద్దరుఅధికారులపై చర్యలు తీసుకుంటే… ఆ విషయంలోనూ… ప్రభుత్వం తరపున మాట్లాడి.. ఆ ఆధికారులను కాపాడేందుకు గవర్నర్ చొరవ తీసుకుంటున్నారన్న చర్చ జరుగుతోంది.