రాజమౌళి ఇంత వరకు ఒక్క ప్లాప్ పడకపోవడానికి కారణం తెలిసింది

సినిమా ఇండస్ట్రీ లో సక్సెస్ అవ్వాలంటే అంత ఈజీ కాదు. హిట్లు ప్లాపులు ఎప్పుడుఒస్తాయో ఎవరికీ తెలియదు. ఈ సినిమా వంద శాతం హిట్ అవుతుందని ఎవ్వరూ చెప్పలేరు. హిట్ ఫార్ములా తెలిసుంటే అందరు హిట్స్ మాత్రమే తీస్తారు. కానీ కొంతమంది దర్శకులు వరుస హిట్స్ ఇచ్చి రికార్డ్స్ సృష్టించారు. అప్పట్లో దాసరి నారాయణ రావు, ఏ కోదండ రామిరెడ్డి లాంటి దర్శకులు వరుస హిట్స్ తో రికార్డ్స్ సృష్టించారు. ఒకప్పుడు తమిళ్ దర్శకుడు శంకర్ కి  కూడా ఇలాంటి రికార్డే ఉండేది. కానీ ఆ తరువాత వరుస ఫ్లోప్స్ ఇచ్చాడు.

ప్రస్తుతం అపజయం అంటే తెలియని దర్శకుడిగా రాజమౌళి ఉన్నాడు. 20 ఏళ్ల కెరీర్లో ఆయన చేసింది కేవలం 12 చిత్రాలు. కానీ సంపాదించిన ఫేమ్ వంద చిత్రాలకు సరిపడా. సినిమాకో వైవిధ్యమైన సబ్జెక్టు ఎంచుకోవడం, ఎంచుకున్న స్క్రిప్ట్ పక్కాగా తెరకెక్కించడం రాజమౌళి టాలెంట్.

ఈ మధ్య ఒక ఇంటర్వ్యూ లో తన సక్సెస్ సీక్రెట్ చెప్పాడు రాజమౌళి. చైల్డ్ హుడ్ లో మదర్ తనని గైడ్ చేసిన విధానం సృజనాత్మకత పెంచి మంచి సినిమాలు తెరకెక్కించడానికి కారణమైందని ఆయన చెప్పారు.

చిన్నప్పుడు వాళ్ళ అమ్మ తనను ఎప్పుడూ స్కూల్ బుక్స్ చదవమని, హోమ్ వర్క్ చెయ్యమని ఒత్తిడి చెయ్యలేదంట. ఖాళీగా కూర్చుంటే ఆడుకో, లేకుంటే కామిక్స్, స్టోరీ బుక్స్ చదువు అని చెప్పేవారంట. ఆ పుస్తాకాలు చదవడం వల్లే తాను ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నానని రాజమౌళి అన్నారు. ప్రస్తుతం రాజమౌళి మహేష్ మూవీ ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నారు రాజమౌళి.