The Raja Saab: ప్రభాస్ రాజా సాబ్ మూవీ టీజర్ రిలీజ్.. బాక్స్ ఆఫీస్ బద్దలవ్వడం ఖాయం!

The Raja Saab: టాలీవుడ్ హీరో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ మూవీ రాజా సాబ్. మారుతి ఈ సినిమాకు దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. ఈ సినిమా ఈ ఏడాది డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన అప్డేట్లు సినిమాపై అంచనాలను భారీగా పెంచేసాయి. కాగా రెబల్ స్టార్ ప్రభాస్ చివరగా సలార్, కల్కి సినిమాలతో ప్రేక్షకులను పలకరించారు. ఈ సినిమాల తర్వాత ప్రభాస్ నుంచి వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి.

కాగా ఈ సినిమాలో ప్రభాస్ డ్యూయల్ రోల్ లో కనిపించనున్న విషయం తెలిసిందే. అలాగే ఈ సినిమాలో ప్రభాస్ కు జోడీగా ముగ్గురు హీరోయిన్ లు నటించనున్నారు. నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిధి కుమార్ హీరోయిన్స్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. ఇది ఇలా ఉంటే ప్రభాస్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న రాజా సాబ్ సినిమా టీజర్ ను తాజాగా విడుదల చేశారు మేకర్స్. తాజాగా విడుదలైన టీజర్ కి ప్రేక్షకుల నుంచి భారీగా రెస్పాన్స్ వస్తోంది. ఈ టీజర్ ని చూసిన ప్రేక్షకులు, ఫ్యాన్స్ రాజా సాబ్ టీజర్ అదిరిపోయింది.

The RajaSaab Telugu Teaser | Prabhas | Maruthi | Thaman | TG Vishwa Prasad | Dec 5 2025

ప్రభాస్ లుక్స్ మాములుగా లేవు. ఫ్యాన్స్ ప్రభాస్ ను ఎలా చూడాలనుకుంటున్నారో మారుతి ప్రభాస్ ను అలా చూపించారు. వింటేజ్ ప్రభాస్ కనిపించాడు. నవ్విస్తూనే భయపెట్టేస్తున్నారు. హారర్ కంటెంట్ తో పాటు మారుతి మార్క్ కామెడీ కూడా రాజా సాబ్ లో అదిరిపోతుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు ఫ్యాన్స్. ఈసారి బాక్స్ ఆఫీస్ బద్దలవ్వడం కాయం, ఈ సినిమా కలెక్షన్ల వర్షం కురిపించడం ఖాయం అంటూ కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.