Pawan Kalyan: పవన్ కళ్యాణ్ ఆ సినిమా వల్ల నిర్మాత అన్ని కోట్లు నష్టపోయాడా.. ఏ సినిమా అంటే?

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు ఇండస్ట్రీలో భారీ క్రేజ్ ఉందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ క్రమంలోనే పవన్ సినిమా అంటే అభిమానులు కూడా పెద్ద ఎత్తున అంచనాలు పెట్టుకున్నారు.అయితే ఒకానొక సమయంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ లను ఎదుర్కొన్నాయి. ఇలా ఫ్లాపయినా చిత్రాలలో అజ్ఞాతవాసి ఒకటి. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో 2018 సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా డిజాస్టర్ గా నిలిచింది.

ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ ఎదుర్కోవడమే కాకుండా కాఫీ అనే కామెంట్లను కూడా భరించాల్సి వచ్చింది. అత్తారింటికి దారేది సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ నటించిన అజ్ఞాతవాసి సినిమాపై కూడా భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ క్రమంలోనే ఈ సినిమా పెద్ద ఎత్తున మార్కెటింగ్ జరిగిన తీవ్రమైన నష్టాలను ఎదుర్కొన్నారు. ఇందులో పవన్ కళ్యాణ్ సరసన అను ఇమ్మానియేల్ కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించారు. పవన్ కళ్యాణ్ నటన అద్భుతంగా ఉన్నప్పటికీ ఈ సినిమా ప్రేక్షకులను సందడి చేయలేకపోయింది.

ఈ సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కి సుమారు 57 కోట్ల వరకు కలెక్షన్లను రాబట్టినప్పటికీ అంతకన్నా పెద్ద మొత్తంలో నష్టాలను ఎదుర్కొందనీ చెప్పాలి.ఈ సినిమా బయ్యర్లు తీవ్రమైన నష్టాలను ఎదుర్కోవడంతో నిర్మాతలు ముందుకు వచ్చి వారికి సహాయం చేశారు.ఇలా పవన్ కళ్యాణ్ నటించిన అజ్ఞాతవాసి సినిమా డిజాస్టర్ గా మిగలడమే కాకుండా నిర్మాతకు 58 కోట్ల నష్టం తెచ్చిపెట్టింది.ఈ సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి ప్రవేశించి రాజకీయాల్లో బిజీగా ఉండటం వల్ల కొన్ని సంవత్సరాల పాటు ఇండస్ట్రీకి దూరమయ్యారు. ప్రస్తుతం ఇండస్ట్రీకి రీ ఎంట్రీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నారు.