Pregnancy Show By Heroines : ప్రెగ్నెన్సీ వస్తే అలా చూపించాల్సిందేనా.?

Pregnancy Show By Heroines : మొన్న కాజల్.. ఇప్పుడు ప్రణీత.. మేము ప్రెగ్నెంట్ అయ్యామోచ్.! అంటూ సోషల్ మీడియాలో వరుస పోస్టులు పెడుతున్నారు. నేను తల్లి కాబోతున్నాను.. అని తెలియచెప్పడం తప్పేం కాదు. కానీ, ఆ పేరు చెప్పి పోటా పోటీగా పొట్టల ప్రదర్శన చేస్తున్నారీ ముద్దుగుమ్మలు.

వీళ్లే కాదు, గతంలోనూ అమీషా పటేల్, సమీరా రెడ్డి.. ఇలా చాలా మంది ముద్దుగుమ్మలు ఈ పోటీలో పార్టీసిపేట్ చేసినవాళ్లే. తమదైన స్టయిల్లో ఫాలోయింగ్ పెంచుకున్నవాళ్లే. ‘తల్లిగా నా మధురానుభూతులు..’ అంటూ హెడ్డింగుల మీద హెడ్డింగులు పెట్టి, ఫోటోల మీద ఫోటోలు పోస్ట్ చేస్తూ ఊదరగొడుతోంది గత ఏడెనిమిది నెలలుగా కాజల్ అగర్వాల్.

రీసెంటుగా రేసులోకి దూసుకొచ్చింది మరో అందాల భామ ప్రణీత. నేను తల్లిని కాబోతున్నా.. అంటూ భర్తతో కలిసి ఈ మధ్య ప్రణీత పోస్ట్ చేసిన ఫోటోలు నెట్టింట వైరల్ అయిన సంగతి తెలిసిందే. తల్లి కాబోతుంటే, ఇంతలా పబ్లిసిటీ చేసుకోవాలా.? అంటూ ఆ ఫోటోలు చూసిన నెటిజన్లు కొందరు ఈ ముద్దుగుమ్మల్నిట్రోల్ చేస్తున్నారు.

తల్లి కావడం అంటే, సెలబ్రిటీల కెరీర్‌కి పెద్ద అడ్డంకిగానే భావించాలి. పెళ్లయితేనే కెరీర్ అటకెక్కిపోతుంది. అలాంటి తల్లయితే ఇంకేమైనా వుందా.? అందుకే, ఈ భామలు కొత్త తెలివితేటలు ప్రదర్శిస్తున్నారు. దీపమున్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలి కదా.. అందుకే ప్రెగ్నెన్సీని సైతం అస్సలు వదులుకోవట్లేదీ ముద్దుగమ్మలు.

తమ ప్రెగ్నెన్సీని కూడా నాలుగు రాళ్లు వెనకేసుకోవడానికే వాడేసుకుంటున్నారు. ఇలా నెట్టింట పెంచుకుంటున్న పాపులారిటీతో లక్షల్లో ఆదాయం ఆర్జిస్తున్నారు. అదే ఈ ‘మధురానుభూతుల ప్రచారం’ వెనక వున్న అసలు సీక్రెట్ నెటిజన్స్ ‌..  మీకర్ధమవుతోందా.!