AP: జగన్ కంచుకోటలో మహానాడు…. మహానాడుకు దూరంగా ఉన్న టీడీపీ ఎమ్మెల్యేలు… అదే కారణమా?

AP: ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీని మరింత బలోపేతం చేసుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డికి కంచుకోటగా ఉన్నటువంటి కడప జిల్లాను పసుపుమయం చేయడం కోసం కూటమినేతలు భారీగా కష్టపడుతున్నారని చెప్పాలి. ఇందులో భాగంగానే వచ్చే ఎన్నికల నాటికి కడపలో కూడా పసుపు జెండా ఎగరాలన్న ఉద్దేశంతోనే చర్యలు తీసుకుంటున్నారు.

ఈ క్రమంలోనే తెలుగుదేశం పార్టీ ఎంతో కీలకంగా వ్యవహరించే మహానాడు కార్యక్రమాన్ని ఈసారి కడపలో నిర్వహించడానికి కూటమి సర్కార్ సిద్ధమైంది. ఈ మహానాడు సభను మే 27వ తేదీ నుంచి 29వ తేదీ వరకు మూడు రోజుల పాటు ఎంతో ఘనంగా నిర్వహిస్తారు. ఇక ఈ మహానాడు సభ మొదటిసారి కడప జిల్లాలో ఏర్పాటు చేయబోతున్నారు. అదేవిధంగా ఈ మహానాడు సభతో 75 సంవత్సరాలు వేడుకను కూడా జరుపుకోబోతున్న నేపథ్యంలో ఎంతో ప్రత్యేకంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు.

ఇలా కడపలో మహానాడు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న నేపథ్యంలో తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి కొంతమంది కీలక నేతలు దూరంగా ఉన్నారని తెలుస్తోంది. బీటెక్ రవితోపాటు మాధవి రెడ్డి వంటి పలువురు కీలక నేతలు ఈ కార్యక్రమ ఏర్పాట్ల పనులకు దూరంగా ఉన్నారని సమాచారం. ఇలా వీరంతా మహానాడు ఏర్పాట్లు పనులకు దూరంగా ఉండటానికి కారణం లేకపోలేదు.

కమలాపురం ఎమ్మెల్యేకు పూర్తిస్థాయి బాధ్యతలు ఇవ్వడంతో వీరు ఆగ్రహంతో ఉన్నారని తెలుస్తోంది. మిగిలిన వారికి ఎవరికీ కూడా ఆ నేత ఎలాంటి పనులను కూడా అప్పగించలేదని తమకు సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వకుండా అన్ని వ్యవహారాలను కమలాపురం ఎమ్మెల్యే చూసుకుంటున్న నేపథ్యంలో మిగిలిన నేతలు ఈ విషయంలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని చెప్పాలి. ఇలా కడపకు చెందిన నేతలు దూరంగా ఉండటంతో ఈ సభ ఎంతవరకు సక్సెస్ అవుతుందోనని పలు సందేహాలను కూడా వ్యక్తం చేస్తున్నారు.