ఇల్లు పెద్దదైన మనసు మాత్రం చిన్నది..మాతృత్వం లేదంటూ ఆవేదన చెందుతున్న రష్మి!

జబర్దస్త్ యాంకర్ గా గుర్తింపు సంపాదించుకున్న రష్మీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కెరియర్ పరంగా ఎంతో.బిజీగా గడుపుతున్నప్పటికీ మూగజీవాల పట్ల ఎప్పటికప్పుడు ఎంతో శ్రద్ధ చూపుతో వాటికి ఏదైనా ఆపద కలిగిందంటే వెంటనే స్పందిస్తూ వాటికి ఆపద చేసిన వారిని దారుణంగా శిక్షించాలని పోరాటం చేస్తుంది. ఇలా మూగజీవాల పట్ల ఎంతో శ్రద్ధ తీసుకునే ఈమె వీధి కుక్కలకు ఏదైనా జరిగితే మాత్రం అల్లాడి పోతుంది. ఇలా ఎన్నో మూగ జంతువులను సురక్షితంగా కాపాడిన రష్మీ తాజాగా మరొక పోస్ట్ ద్వారా ఆవేదన వ్యక్తం చేసింది.

రష్మి షేర్ చేసిన ఒక వీడియోలో ఒక స్వచ్ఛంద సంస్థకు సంబంధించిన వాలంటీర్లు వీధి కుక్కలకు ఫీడ్ చేయడం కోసం వచ్చినట్లు తెలుస్తుంది. ఇలా వారందరూ వారి పనులలో నిమగ్నం కాక అక్కడ ఒక పెద్ద ఇంటికి సంబంధించిన ఓ వ్యక్తి బయటకు వచ్చి వాలంటీర్లపై దురుసుగా ప్రవర్తించారు.ఆ ఇల్లు చూడటానికి ఎంతో పెద్దగా ఉన్న ఆ వ్యక్తి మనసు మాత్రం చాలా చిన్నగా ఉందంటూ అతని పరువు మొత్తం తీసింది. ఆయనతోపాటు కాసేపటికి మరో మహిళ కూడా ఇలాగే ప్రవర్తించింది.

రష్మీ ఆ మహిళలను ఉద్దేశిస్తూ మహిళలోని మాతృత్వం ఎక్కడికిపోయింది.. ఆమె కూడా ఇలానే ప్రవర్తిస్తోంది?.. అంటూ పోస్ట్ చేసింది. మొత్తానికి రష్మీ చేసిన ఈ పోస్ట్ వైరల్ గా మారింది.ఇలా ఈమె నిత్యం కుక్కల కోసం పోరాటం చేస్తూ పోస్టులు చేయడం ద్వారా కొందరిలో అయినా మార్పు వస్తుందేమోనని. తాపత్రయపడుతూ నిత్యం ఇలా వీధి కుక్కలను ఎవరైనా హింసిస్తే తప్పకుండా వారిని ప్రశ్నిస్తుంది.