ప్రస్తుతం దేశంలో కరోనా మళ్లీ కలకలం రేపుతుంది. ఇప్పటికే పలు దశలు వ్యాపించి ప్రజలను బాగా వణికించింది. ఇక గత కొన్ని రోజుల నుంచి ప్రశాంతంగా ఉన్న దేశాలు మళ్లీ వైరస్ వ్యాప్తితో వణుకుతున్నాయి. తాజాగా ఈ వైరస్ పట్ల అప్రమత్తంగా ఉండాలి అని హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్ సూచించారు.
వానకాలం వస్తుంది అని.. కరోనా కేసులు పెరిగే అవకాశం ఉందని.. జ్వరం, జలుబు, వాసన రాకుండా ఉంటే వెంటనే పరీక్షలు చేయించుకోవాలి అని అన్నారు. ఇంకా కరోనా మొత్తం పోలేదు అంటూ.. డిసెంబర్ వరకు కొనసాగే అవకాశం ఉందని అన్నారు. రాష్ట్రంలో ఒక్క వారంలోనే 811 కేసులు నమోదు అయ్యాయి అని.. తప్పనిసరిగా మాస్కులు ధరించాలి అని వ్యాక్సినేషన్ లు పూర్తి చేసుకోవాలి అని తెలిపారు.