గాడ్ ఫాదర్, ది ఘోస్ట్ సినిమాలు ఓటిటి లో వచ్చేది అప్పుడే?

సినిమా టికెట్ ధరలు అమాంతం పెరగడంతో జనాలు ఓటిటి లో వచ్చే వరకు ఆగి చూస్తున్నారు. దీంతో ఓటిటి రైట్స్ కి కూడా డిమాండ్ పెరిగింది. థియేటర్ లో సరిగ్గా ఆడకపోయినా ఓటిటి లో సూపర్ హిట్ అయిన సందర్బాలు ఉన్నాయి. నాగార్జున ‘వైల్డ్ డాగ్’ సినిమా థియేటర్ లో ప్లాప్ అయినా కానీ ఓటిటి లో సూపర్ హిట్ అయ్యింది.

ఇప్పుడు ప్రముఖ ఓటిటి సంస్థ రీసెంట్ గా విడుదలయిన ‘గాడ్ ఫాదర్’, ‘ది ఘోస్ట్’ డిజిటల్    రైట్స్ ని భారీమొత్తానికి కొనుగోలు చేసినట్టు తెలుస్తుంది. చిరంజీవి గాడ్ ఫాదర్ మూవీ డిజిటల్ రైట్స్ ను రూ. 57 కోట్లకు తెలుగు, తమిళం, హిందీ భాషల హక్కులను నెట్ ఫ్లిక్స్ చేజిక్కుంచుకున్నట్లు సమాచారం.

అలాగే నాగార్జున ‘ది ఘోస్ట్’ సినిమాకు భారీ ధర ఇచ్చిన్నట్టు తెలుస్తుంది. అయితే ఈ  రెండు సినిమాలు  సుమారు 8 వారాల తర్వాతే ఓటీటీలో రిలీజ్ కానుందని తెలుస్తోంది.