GHMC ఎన్నికలే తెరాస ప్రత్యర్థిని నిర్ణహించబోతున్నాయి

Ghmc elections telugu rajyam

  దేశ వ్యాప్తంగా మరోసారి చిన్న పెద్ద ఎన్నికల నగారా మోగింది. దీనితో GHMC ఎన్నికలు నిర్వహించటానికి మార్గం ఏర్పడింది. నవంబర్ రెండో వారంలో ఎన్నికలు ఉండవచ్చని కేటీఆర్ ఇప్పటికే పార్టీ వర్గాలకు పిలుపునిచ్చాడు. దీనితో తెరాస ముందస్తు సన్నాహాలు మొదలెట్టాయి. ఈ ఎన్నికలు భావి ముఖ్యమంత్రిగా భావిస్తున్న కేటీఆర్ కి చాలా ప్రత్యేకమైనవి. ఇందులో ఘన విజయం సాధించి ఆ ధీమాతో ముఖ్యమంత్రి పదవి చెప్పట్టాలని ఉన్నట్లు తెలుస్తుంది.

Ghmc elections telugu rajyam

 

   గతంలో కేటీఆర్ GHMC ఎన్నికల బాధ్యతను మోస్తూ ఏకంగా 99 స్థానాలు కైవసం చేసుకొని మొదటిసారి బల్దియా పీఠంపై గులాబీ జెండా రెపరెపలాడించారు. ఆ అనుభవం కేటీఆర్ కి ఇప్పుడు మరింత కలిసివచ్చి ఈసారి సెంచురీ కొట్టగలమనే ధీమాతో తెరాస శ్రేణులు వున్నారు. కెసిఆర్ కూడా వీటిని సీరియస్ గా తీసుకోని తనదైన సర్వేలు చేపిస్తూ ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాడు. మరోపక్క బీజేపీ కూడా GHMC ఎన్నికల్లో సరికొత్త వ్యూహం అమలుచేస్తూ, ఏకంగా నలుగురు అధ్యక్షులను నియమించి ఎన్నికల గోదాలోకి దిగింది. కెసిఆర్ చేయించిన సర్వేలో బీజేపీ బలం పుంజుకున్నట్లు నివేదికలు కూడా వచ్చినట్లు సమాచారం.

  ఇక కాంగ్రెస్ అయితే ఇప్పటివరకు GHMC ఎన్నికలను పట్టించుకున్న దాఖలాలు కనిపించటం లేదు. సీనియర్ నేతల మధ్యనున్న అసమ్మతి కారణంగా ఎవరికీ వారే మౌనంగా ఉండటంతో, క్రిందిశ్రేణి నేతల్లో ఉత్సహం లేదు. టీడీపీ పరిస్థితి గురించి ప్రత్యేకంగా చెప్పేదేమీ లేదు. పేరుకే జాతీయ పార్టీ తప్ప తెలంగాణ ఓటు బ్యాంకు ను దాదాపుగా కోల్పోయింది. మజ్లిస్ పార్టీకి, తెరాస కి లోపాయికారి ఒప్పందం ఎలాగూ ఉంటుంది. మజ్లిస్ బలంగా ఉన్న స్థానాల్లో తెరాస బలహీనమైన వాళ్ళని పోటీచేపిస్తుంది. కాబట్టి ఎటొచ్చి మజ్లిస్ 40 స్థానాల్లో గెలవటం ఖాయం. ఈ ఎన్నికల్లో తెరాస కి గట్టి పోటీ ఇచ్చిన పార్టీనే రాబోయే రోజుల్లో రాష్ట్రంలో ప్రధాన ప్రత్యర్థి కాబోతుందనే మాటలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం హవా చూస్తే తెరాసకి గట్టి పోటీఇచ్చేది బీజేపీ అని తెలుస్తుంది.