ఈ నెల 16న తొలి చంద్రగ్రహణం… ఏ ప్రాంతాలలో కనిపించనుందో తెలుసా?

అమావాస్య పౌర్ణమి రోజుల్లో సూర్య చంద్ర గ్రహణాలు ఏర్పడటం సర్వసాధారణం. ఈ క్రమంలోనే ఈ ఏడాది ఏప్రిల్ 30వ తేదీ తొలి సూర్యగ్రహణం ఏర్పడింది. అదేవిధంగా మే 16వ తేదీ పౌర్ణమి. అయితే ఇదే రోజున తొలి చంద్రగ్రహణం కూడా ఏర్పడనుంది. మే 16వ తేదీ ఏర్పడే చంద్రగ్రహణం సంపూర్ణ చంద్రగ్రహణం. అయితే ఈ చంద్ర గ్రహణ ప్రభావం భారత దేశంలో లేదని పండితులు చెబుతున్నారు.మరి ఏ ఏ దేశాలలో సంపూర్ణ చంద్రగ్రహణం ప్రభావం ఏర్పడనుంది?ఏ సమయంలో చంద్ర గ్రహణం ఏర్పడుతుంది అనే విషయాలను తెలుసుకుందాం..

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ ఏడాది మే 16వ తేదీన తొలి చంద్రగ్రహణం ఏర్పడనుంది. సోమవారం సాయంత్రం 08:59 గంటలకు ప్రారంభమై ఉదయం 10:23 వరకు అయితే మన దేశంలో చంద్రగ్రహణ ప్రభావం లేదు.యూరప్, నైరుతి ఆసియా, ఆఫ్రికా, ఉత్తర అమెరికాలోని చాలా ప్రాంతాలు, దక్షిణ అమెరికా, పసిఫిక్ మహాసముద్రం, హిందూ మహాసముద్రం వంటి దేశాలలో సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడింది.

ఇక భారతదేశంలో చంద్రగ్రహణం కనిపించకపోవడం వల్ల పెద్దగా చింతించాల్సిన పనిలేకపోయినప్పటికీ ఈ గ్రహణ సమయంలో కొన్ని జాగ్రత్తలను పాటించడం ఎంతో మంచిది. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు చిన్న పిల్లలు గ్రహణ సమయంలో పలు జాగ్రత్తలు తీసుకోవడం ఎంతో ఉత్తమం.