Crime News: ఈ మధ్యకాలంలో మహిళల మీద అత్యాచారాలు రోజురోజుకి పెరుగుతూనే ఉన్నాయి. ఆటోలు ,బస్సులు , ట్రైన్లు ఇలా వేటిలోనూ మహిళలకు రక్షణ లేకుండా పోయింది. మహిళలు ఒంటరిగా ప్రయాణం చేయాలంటేనే ఎప్పుడు ఏం జరుగుతుందో అని భయానికి గురి అవుతున్నారు. ఇటీవల సొంత ఊరు వెళ్ళడానికి ప్రైవేట్ బస్సు ఎక్కిన మహిళలపై బస్సు డ్రైవర్ నీచానికి పాల్పడ్డాడు. మూడు వేల రూపాయలు తీసుకొని ఆమెను కత్తితో బెదిరించి అత్యాచారం చేశాడు.
వివరాలలోకి వెళితే..ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన ఓ మహిళ హైదరాబాద్ కూకట్పల్లి నుంచి సొంత ఊరికి వెళ్లేందుకు ఈ నెల 23న లగేజ్ బస్సులో పంపి తాను ట్రైన్ లో వెళ్ళవలసి ఉండగా.. బస్సు డ్రైవర్ సీట్ ఇప్పిస్తానని చెప్పటంతో 3 వేల రూపాయలు చెల్లించి ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఎక్కింది. డ్రైవర్ 3 వేల రూపాయలు డబ్బు తీసుకొని ఆమెకు బస్సు చివరి బర్త్ ఇప్పించాడు. అర్ధరాత్రి సమయంలో మహిళలను కత్తితో బెదిరించి ఆమెపై అత్యాచారం చేశాడు. అంతేకాకుండా ఆమె ఆ సమయంలో కూడా ఆమెపై దొంగతనం ఆరోపించి ఏడు వేల రూపాయలు డబ్బు తీసుకున్నట్టు మహిళ ఆరోపించింది.
సదరు మహిళకు న్యాయం జరగాలని బాధితురాలి తో పాటు ఎమ్మార్పీఎస్ నాయకులు జేఎన్టీయూ నుంచి రాజ్‌భవన్ వెళ్తున్న గవర్నర్ కాన్వాయ్‌ను కూకట్‌పల్లిలో అడ్డుకునేందుకు యత్నించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు బస్సు డ్రైవర్ నీ పోలీసులు అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై పోలీసులు నిందితుడిని విచారిస్తున్నారు. తనకు న్యాయం జరిగేలా చూడాలని బాధితురాలు డిమాండ్ చేసింది.