Crime News: పక్కా ప్రణాళికతో ఎటిఎం క్యాష్ వాహనంతో ఉడాయించిన డ్రైవర్..!

Crime News: ఈ మధ్యకాలంలో దొంగలు కూడా తమ క్రియేటివిటీని ఉపయోగించి కొత్త పద్ధతులలో దొంగతనాలు చేస్తున్నారు. ప్రపంచంలో లో క్రియేటివిటీ ఎక్కువగా ఉన్నవారిలో దొంగలు కూడా ముందుంటారు. సాధారణంగా దొంగతనాలు చేసే వారు ఎక్కడ ఉన్నా కూడా వారి చేతివాటం చూపిస్తూ ఉంటారు.ఏవైనా విలువైన వస్తువులు కనిపిస్తే వాటిని ఎలా దొంగలించాల అని వివిధ రకాలుగా ప్రణాళికలు సిద్ధం చేస్తారు. తాజాగా ఇటువంటి సంఘటన దుండిగల్‌ పీఎస్ పరిధిలో చోటు చేసుకుంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మేడ్చల్‌ మల్కాజ్‌గిరికి చెందిన ఒక దొంగ తన క్రియేటివిటీ ఉపయోగించి ఎంతో చాకచక్యంగా ముందే చేసుకున్న ప్రణాళిక ప్రకారం ఏటీఎం క్యాష్ వాహనాన్ని దొంగలించాడు. మల్కాజ్‌గిరికి చెందిన సాగర్ అనే వ్యక్తి ఏటీఎం క్యాష్ వాహనానికి డ్రైవర్ గా పని చేస్తున్నాడు. ఈ తరుణంలో శనివారం సాయంత్రం మూడు గంటల ప్రాంతంలో దుండిగల్ సాయిబాబా నగర్ లోని యాక్సిస్ బ్యాంక్ ఏటిఎంలో డిపాజిట్ చేయడానికి వాహనం వచ్చింది. రైటర్ సంస్థకు చెందిన ఈ ఏటీఎం క్యాష్ వాహనంలో 36 లక్షల రూపాయల నగదు ఉంది. క్యాష్ డిపాజిట్ చేయడానికి వచ్చిన సమయంలో వాహనం నుండి క్యాషియర్ 3 లక్షల రూపాయలు డిపాజిట్ చేయడానికి తీసుకున్నాడు. క్యాషియర్ వెంట గన్ మ్యాన్ కూడా వెళ్లి క్యాష్ డిపాజిట్ చేస్తున్న సమయంలో డ్రైవర్ మాత్రమే వాహనంలో ఉండి వాహనాన్ని మలుపు తిప్పుకొని వస్తా అని చెప్పి వాహనాన్ని కదిలించాడు.

ఎంత సేపటికీ వాహనం తిరిగి రాకపోవడంతో అనుమానం వచ్చి క్యాషియర్ వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వారిని విచారించగా.. డ్రైవర్ డబ్బు ఉన్న ఏటీఎం క్యాష్ వాహనాన్ని దొంగలించాడు అని పోలీసులకు వివరించారు. దొంగలించిన వాహనానికి
జిపిఎస్ ఉండటంతో దానీ సహాయంతో వాహనాన్ని ట్రేస్ చేసిన పోలీసులు నర్సాపూర్ అడవిలో వాహనాన్ని గుర్తించారు.పోలీసులు వెంటనే అక్కడికి చేరుకొని పరిశీలించగా వాహనంలో డబ్బు లేదు. వాహనం పక్కనే తుపాకీ కూడా పడి ఉంది. పోలీసులు దొంగ వివరాలను ఆరా తీస్తూ.. గతంలో కూడా ఇటువంటి దొంగతనాలు ఏమైనా జరిగాయా అన్న కోణంలో దర్యాప్తు చేపట్టారు.