108, 104లో భారీ సంఖ్యలో డ్రైవర్, మెకానిక్ ఉద్యోగ ఖాళీలు.. ఎలా దరఖాస్తు చేయాలంటే?

దేశంలో చాలామంది డ్రైవర్, మెకానిక్ ఉద్యోగ ఖాళీల కోసం ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వ వాహనాలలో డ్రైవర్, మెకానిక్ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైతే వాళ్లకు ఎక్కువ మొత్తంలో వేతనం లభించే అవకాశం ఉంటుంది. అర్హత ఆధారంగా వేతనం లభించనున్న నేపథ్యంలో అర్హత, ఆసక్తి ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైతే మంచిది. చిత్తూరు జిల్లాలో ఈ జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ కావడం గమనార్హం.

ఈ ఉద్యోగ ఖాళీల విషయంలో అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆధార్ కార్డు, పదవ తరగతి మార్క్ లిస్టు ,ఇతర విద్యా అర్హత ,డ్రైవింగ్ లైసెన్సు, ఇతర జిరాక్స్ లతో జిల్లా కార్యాలయం,జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి చిత్తూరులో సంప్రదించాల్సి ఉంటుంది. ప్రస్తుతం పని చేస్తున్న డ్రైవర్లు, మెకానిక్ లకు ఎంత మొత్తం వేతనం లభిస్తుందో ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు అదే స్థాయిలో వేతనం లభిస్తుంది.

ఆఫ్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉన్న నేపథ్యంలో అర్హత, ఆసక్తి ఉన్నవాళ్లు వెంటనే దరఖాస్తు చేసుకుంటే మంచిది. డ్రైవింగ్ లో అనుభవం ఉండి లైసెన్స్ ఉన్నవాళ్లకు ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా బెనిఫిట్ కలగనుంది. ఈ ఉద్యోగాలకు పోటీ కూడా తక్కువగానే ఉండే ఛాన్స్ అయితే ఉందని చెప్పవచ్చు. వరుస జాబ్ నోటిఫికేషన్ల వల్ల నిరుద్యోగులకు ఎంతో మేలు జరుగుతోంది.

చిత్తూరు జిల్లాకు చెందిన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలపై దృష్టి పెడితే మంచిది. 108, 104లో పని చేయడం ద్వారా ఇతరులకు సేవ చేసిన వాళ్లు అవుతారనే సంగతి తెలిసిందే. అర్హతలు లేకుండా ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకుంటే మాత్రం ఉద్యోగాలకు ఎంపికయ్యే అవకాశాలు తక్కువగా ఉంటాయి.