కరోనా వైరస్ తో ప్రపంచం ఎలాంటి పరిస్థితుల్లో ఉందో తెలిసిందే. భారత్ లోనూ చాపకింద నీరులా విస్తరించి మహమ్మారి ఇక్కడా విలయ తాండవమాడుతోంది. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికే లక్షల్లో కేసులు..వేలల్లో మరణాలు సంభవించాయి. మరణాలు లక్షకు చేరువవుతున్నాయి. అవి కోటికి పెరిగినా ఆశ్చర్యపోనవసరం లేదు. రేపో మాపో వ్యాక్సిన్ వస్తుంది. పర్మినెంట్ గా కరోనాకి చెక్ పెట్టొచ్చని అంతా భావిస్తోన్న తరుణమిది. అయితే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ (డబ్ల్యూ.హెచ్ .ఓ) తాజాగా పిడుగు వార్త వెల్లడించింది. కరోనా హెచ్.ఐ.వీ వైరస్ లాంటింది. ఎప్పటికీ అంతమవ్వదని హెచ్చరించింది.
ప్రపంచ దేశాలు దానితో జీవించడం నేర్చుకోవడం అలవాటు చేసుకోవాలని డబ్ల్యూ.హెచ్.వో ఉన్నత నిపుణుడు వెల్లడించారు. జనవరి 21 నుంచి రోజువారి నివేదికను ఇస్తోన్న సంస్థ ఈ విషయాన్ని వెల్లడించడంతో ప్రపంచ దేశాల గుండెల్లో రైళ్లు పరిగెట్టడం మొదలైంది. కరోనా ప్రపంచ సమాజంలో హెచ్ ఐవీ లాంటి మరోక స్థానిక వైరస్ కావొచ్చని అనుమానం వ్యక్తం చేసారు. కోవిడ్ -19 ఈక్వల్ట్ ఎయిడ్స్ కాకపోయినా వైరస్ పరిస్థితి అలాగే ఉందని తెలిపారు. అలాగే కేసుల సంఖ్య ఎక్కువగా ఉన్నప్పుడు లాక్ డౌన్ పరిమితులు ఎత్తివేయడం మరింత సంక్రమణకు దారితీస్తుందని హెచ్చరించారు.
దీన్ని నివారించడానికి ప్రతీ ఒక్కరు శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుకోవడం ఒక్కటే మార్గమన్నారు. కోవిడ్-19పై వ్యాక్సిన్ వచ్చినప్పుడు మాత్రమే దాన్ని అరికట్టగలం అని…అప్పటి వరకూ ఏమీ చేయలేమని డబ్లూ హెచ్ ఓ కుండ బద్దలు కొట్టేసింది. ప్రపంచ దేశాలు సహా భారత్ లాక్ డౌన్ ఎత్తేద్దాం అనుకుంటోన్న సమయంలో డబ్లు హెచ్ ఓ తాజా హెచ్చరికతో ఒక్కొక్కరి గుండెళ్లో రైళ్లు పరిగెత్తడం మొదలైంది. ఇప్పటికే వైరస్ కి విరుగుడుగా ప్రపంచ దేశాలు ఔషధాన్ని కనిపెట్టే పనిలో పడ్డాయి. కానీ ఇప్పటివరకూ ఎలాంటి పురోగతి కనిపించలేదు. హెచ్ ఐవీ వైరస్ విరుగుడుగా ఔషధాన్ని కనిపెట్టే పనిలో శాస్త్రజ్ఞులు కొన్నేళ్లుగా శ్రమిస్తున్నా ఇప్పటివరకూ మందు కనుగోనలేదు. తాత్కలిక మందులు తప్ప ఎయిడ్స్ కి పర్మినెంట్ మెడిసిన్ లేని సంగతి తెలిసిందే. ఇదొక్కటే కాదు.. ఇంతకుముందు దేశంలో ప్రబలిన కొన్ని అంటువ్యాధులకు ఇప్పటికీ వ్యాక్సిన్ లేకపోవడంతో ప్రమాదం ఎప్పుడూ పొంచి ఉందని అర్థం చేసుకోవాల్సిన తరుణమిదని విశ్లేషిస్తున్నారు.