Big Boss Non Stop: ఓటీటీలో ప్రసారమైన బిగ్ బాస్ నాన్ స్టాప్ రియాలిటీ షో పూర్తయింది. మునుపెన్నడూ లేని విధంగా బిగ్ బాస్ చరిత్రలోనే మొదటిసారిగా ఒక లేడీ కంటెస్టెంట్ టైటిల్ ని దక్కించుకుంది. ఈ నాన్ స్టాప్ సీజన్ మొదలైన నాటి నుండి బిందుమాధవి అఖిల్ మధ్య టైటిల్ కోసం పోటీ జరుగుతోంది. కొంతకాలం తర్వాత ఈ టైటిల్ కోసం ఉన్న పోటీలో నటరాజ్ మాస్టర్, శివ కూడా చేరిపోయారు. కానీ అనూహ్యంగా నట రాజ్ మాస్టర్ తన ప్రవర్తన కారణంగా నెగెటివిటీ మూటకట్టుకుని 11 వారంలో హౌస్ నుండి ఎలిమినేట్ అయ్యాడు. 18 మంది కంటెస్టెంట్ ల తో ప్రారంభమైన ఈ రియాలిటీ షో లో ఏడు మంది కంటెస్టెంట్ లు ఫినాలే వరకు చేరుకున్నారు.
వీరిలో అఖిల్, బిందు మొదటి రెండు స్థానాలలో ఉండగా.. మూడు, నాలుగు స్థానాల్లో మిత్ర, శివ ఉన్నారు. నాన్ స్టాప్ సీజన్ ప్రారంభమైన తొలినాళ్లలో డేంజర్ జోన్ లో ఉన్న శివ నిదానంగా తన ఆట తీరును మెరుగు పరుచుకుని టాప్ 5 వరకు చేరుకున్నాడు. అయితే బిగ్ బాస్ లో పాటిస్పేట్ చేయటానికి చాలామంది లంచం ఇచ్చి వార్తలు వినిపించాయి. ఈ నాన్ స్టాప్ సీజన్లో కూడా పాటిస్పేట్ చేయటానికి చాలామంది బిగ్ బాస్ వార్తలు వినిపించాయి. అయితే గతంలో చాలా మంది బిగ్ బాస్ లో పాల్గొనటానికి డైరెక్టుగా బిగ్ బాస్ యాజమాన్యాన్ని సంప్రదించినట్టు అధికారికంగా తెలియజేశారు.
ఇప్పుడు ఈ నాన్ స్టాప్ సీజన్లో కూడా చాలామంది ఇలా రికమండేషన్ ద్వారా వచ్చినట్టు సమాచారం. ఇదిలా ఉండగా ఈ బిగ్ బాస్ నాన్స్టాప్ సీజన్ లో టాప్ ఫైవ్ కి చేరుకోవడానికి ఒక కంటెస్టెంట్ బిగ్ బాస్ వారికి లంచం ఇచ్చినట్లు వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. టాప్ సెవెన్ కంటెస్టెంట్ లో ఫైనల్ కు చేరుకున్న వారిలో మిత్రశర్మ కూడా ఒకరు. అయితే బిగ్ బాస్ నుండి ఎప్పుడు ఎలిమినేట్ అవుతుంది అనుకున్న ఆమె అనూహ్యంగా ఫినాలే వరకు చేరుకుంది. ఆమె మంచి క్యాష్ పార్టీ అవటం వల్ల టాప్ 5 లో స్థానం సంపాదించడానికి ఆమె బిగ్ బాస్ కి లంచం ఇచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ విషయం ఎంతవరకు నిజం అన్న దాని గురించి ఇంకా స్పష్టత రాలేదు. మిత్రశర్మ బిగ్ బాస్ నుండి బయటకు వచ్చిన తర్వాత కూడా ఈ విషయం గురించి ఎక్కడా స్పందించలేదు.