కాంగ్రెస్ లో భగ్గుమంటున్న అసమ్మతి.. గ్రేటర్ లో గరంగరం.. ఉత్తమ్, రేవంత్ కు ఘోర అవమానం..?

uttam kumar revanth reddy

 గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు వేడి ఒక రేంజు లో రాజుకుంది. ఉన్నఫలంగా గ్రేటర్ ఎన్నికల నోటిఫికెషన్ విడుదల కావటంతో ప్రత్యర్థి పార్టీలు షాక్ తిన్నాయి. సరైన అభ్యర్థులు దొరక్కపోవడంతో కింద మీద పడుతున్నారు. కొంచంలో కొంచం బీజేపీ ఒక మోస్తరుగా ఎన్నికలకు సమాయత్తం అయినట్లు తెలుస్తుంది కానీ, కాంగ్రెస్ పరిస్థితి మాత్రం మరింత దారుణంగా తయారైంది.

uttam kumar revanth reddy

 గ్రేటర్ లో గట్టి పట్టున్న సీనియర్ నేతలు కాంగ్రెస్ అగ్ర నాయకత్వం మీద అలకబూనినట్లు తెలుస్తుంది. మరికొంత మంది నేతలు పార్టీకి రాజీనామా చేసినట్లు తెలుస్తుంది. శేరిలింగంపల్లి మాజీ ఎమ్మెల్యే భిక్షపతి యాదవ్ పార్టీ మారే ఆలోచనలో ఉన్నట్లు తెలియటంతో కాంగ్రెస్ నేతలైన ఉత్తమ్ కుమార్ రెడ్డి, రేవంత్ రెడ్డి, జీవన్ రెడ్డి కలిసి ఆయన ఇంటికి వెళ్లి బుజ్జగించడానికి ప్రయత్నాలు చేశారు,కానీ భిక్షపతి యాదవ్ మాత్రం పార్టీలో కొనసాగేందుకు ససేమిరా అనటంతో ఆయా నేతలు నిరాశతో వెనుతిరిగారు.

 అదే విధంగా నియోజకవర్గ ఇంచార్జి రవికుమార్ యాదవ్ కూడా పార్టీకి రాజీనామా చేశారు. సరిగ్గా నామినేషన్ కు మూడు రోజులు మాత్రమే సమయం ఉండటంతో ఇప్పడూ ఈ అలకలు పార్టీకి తీవ్ర నష్టం కలిగించే అవకాశం గట్టిగా ఉంది. అదే విధంగా నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అంజన్ కుమార్ యాదవ్ కూడా పార్టీ నాయకత్వం మీద అలకబూని మొన్న గాంధీ భవన్ లో జరిగిన సమావేశానికి డుమ్మా కొట్టినట్లు తెలుస్తుంది. కనీసం తనకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే అభ్యర్థులను ప్రకటిస్తున్నారు అంటూ ఆయన ఆరోపిస్తున్నారు.

 ఇక మరోపక్క ఉత్తమ్ కుమార్ రెడ్డి నిన్న పార్లమెంట్ స్థానాల వారీగా కమిటీలను ఏర్పాటు చేశాడు , ఈ రోజు నియోజకవర్గాల మరియు పోల్ మేనేజ్మెంట్ కమిటీలను ఏర్పాటు చేసి, రేపు అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. ఈ నెల 21 న గ్రేటర్ హైదరాబాద్ మ్యానిఫెస్ట్ విడుదల చేయబోతున్నట్లు తెలుస్తుంది. అయితే ముందుగా సొంత పార్టీలో పెరుగుతున్న అసమ్మతి జ్వాలను తగ్గించుకునే విషయంపై కాంగ్రెస్ పెద్దలు దృష్టి సారించాలి, లేకపోతే మొదటికే మోసం వచ్చే అవకాశం వుంది.