నేరుగా వై ఎస్ జగన్ సర్కార్ మీదనే ‘ లా సూట్ ‘ – ఏపీ లో బిగ్ బ్రేకింగ్ ఇదే ! 

 

సమాజంలో రాజకీయనాయకులకు ప్రజలు పదవులు కట్టబెట్టేది ప్రజా సమస్యలను తీరుస్తారని.. కానీ నేటి రాజకీయాల్లో జరుగుతున్నది ఏమిటి.. ఒకరినొకరు విమర్శించుకోవడం.. పదవులతో పాటుగా ఆస్తులను కూడబెట్టుకోవడం. ప్రజా సంక్షేమాన్ని గాలికి వదిలేసి స్వార్ధంతో బ్రతకడం.. వారసత్వంగా పదవులను పంచడం.. ఇదే ప్రస్తుత రాజకీయాల్లో నడుస్తున్న తీరు.. ఇకపోతే పాలనలో ఎలాంటి అనుభవం లేకుండానే ప్రజల ఆశీస్సులతో అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్ సీయం గా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుండే దూకుడుగా వ్యవహరిస్తూ పాలనలో తనదైన శైలిని ప్రదర్శిస్తున్నారు..

 

 

YS Jagan fulfills YS Rajasekhar Reddy’s dream

ఏపీ ప్రజల ప్రతి గడపలోని కష్టాలను స్వయంగా పాదయాత్ర చేస్తూ చూసిన వైఎస్ జగన్ పేదల కోసమే వైసీపీ ప్రభుత్వం అనేలా ప్రవర్తిస్తూ, వారికోసం ఎన్నో సంక్షేమ పధకాలను ప్రవేశపెట్టారు.. అంతేకాక ఇదివరకు ఏపీ రాజకీయాల్లో జరిగిన అవినీతిని బయటపెడుతూ ప్రతిపక్షాలకు ఊపిరి ఆడకుండా చేస్తున్నారు వైఎస్ జగన్.. అయితే ప్రజల్లో వైఎస్ జగన్‌కు పెరుగుతున్న ఆదరణ చూసిన ప్రతిపక్షం ఏదో ఒకరకంగా అడ్దంకులు సృష్టిస్తుంది.. అదీగాక ముఖ్య‌మంత్రిగా వైఎస్ జ‌గ‌న్ అధికారం చేప‌ట్టిన‌ప్ప‌టి నుంచి కూడా ప్ర‌తిప‌క్షాలు అడుగ‌డుగునా ఏదో ర‌కంగా అడ్డుకుంటూనే ఉన్నాయి. ముఖ్యంగా న్యాయ‌స్థానాలను ఆశ్ర‌యిస్తూ పాల‌నా ప‌ర‌మైన అంశాల్లో ఎన్ని ర‌కాలుగా అడ్డంకులు సృష్టించ‌వ‌చ్చో, అన్ని ర‌కాల ప్రయత్నాలు చేస్తున్నారు.

 

ఇక ఈ పదహారు నెలల్లో వైసీపీ మీద హైకోర్టులో వ్యాజ్యాలు, తీర్పులు, ఆదేశాలు ఇలా ఎన్నో రకాలైన అవరోధాలు.. ఇది చాలదన్నట్లుగా వైఎస్ జగన్ సర్కార్ మీద తాజాగా హైకోర్టులో ఓ వ్యాజ్యం దాఖ‌లైంది. ఇంత వ‌ర‌కూ జ‌గ‌న్ స‌ర్కార్‌పై దాఖ‌లైన వ్యాజ్యాల్లో ఇది ఎంతో ప్ర‌త్యేక‌మైన‌దిగా చెప్పుకోవ‌చ్చు. ఎందుకంటే ఏకంగా ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌తో పాటు మంత్రులు వెల్లంప‌ల్లి శ్రీ‌నివాస్‌, కొడాలి నాని త‌దిత‌రులను త‌మ ప‌ద‌వులు, పోస్టులు నిర్వ‌హించ‌కుండా నిలువ‌రించాల‌ని అభ్య‌ర్థిస్తూ హైకోర్టులో కోవారెంటో పిటిష‌న్ దాఖ‌లైంది. కాగా గుంటూరు జిల్లా అమ‌రావ‌తి మండ‌లం వైకుంఠ‌పురం గ్రామానికి చెందిన ఓ వ్య‌క్తి ఈ వ్యాజ్యాన్ని దాఖ‌లు చేశాడు.. అదీగాకుండా ముఖ్య‌మంత్రిగా జ‌గ‌న్‌, మంత్రులుగా వెల్లంప‌ల్లి, నాని, టీటీడీ చైర్మ‌న్ వైవీ సుబ్బారెడ్డి, ఈఓ అశోక్ ‌సింఘాల్‌ ఏ అధికారంతో పదవిలో కొన‌సాగుతున్నారో వివ‌ర‌ణ కోరాల‌ని పిటిష‌న‌ర్ హైకోర్టును అభ్య‌ర్థించారట. మరి ఈ తతంగం వెనక ఎవరున్నారనేది అంతుచిక్కని ఓ ప్రశ్న వైసీపీ నాయకులను వేధిస్తుందట..