Bheemla Nayak: సాగర్ కే చంద్ర దర్శకత్వంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై భారీ బడ్జెట్ చిత్రంగా తెరకెక్కుతున్న సినిమా భీమ్లా నాయక్. ఇందులో పవన్ కళ్యాణ్ రానా హీరోలుగా సందడి చేయనున్నారు. ఇప్పటికే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండగా కరోనా కారణం వల్ల వాయిదా పడుతూ వస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా ఓ పాట చిత్రీకరణ జరుపుకుంటుంది.దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలోనే పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తిచేసి ఈనెల 25వ తేదీన విడుదల చేయడానికి చిత్ర బృందం అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.
ఒకవేళ ఈ సినిమా 25వ తేదీ విడుదల కాకపోతే ఈ సినిమాని ఏప్రిల్ 1వ తేదీ విడుదల చేయడానికి పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు.ఇదిలా ఉండగా ఈ సినిమాలో ఒక అద్భుతమైన పాటను పాడటం కోసం చిత్రబృందం ఏకంగా బాలీవుడ్ సూపర్ సింగర్ కైలాష్ ఖేర్ ను రంగంలోకి దించారు. ఇప్పటికే ఈయన మహేష్ బాబు భరత్ అనే నేను సినిమాలో వచ్చాడయ్యో సామి అనే పాట ద్వారా టాలీవుడ్ శ్రోతలను ఆకట్టుకున్నారు. ఈ క్రమంలోనే మరోసారి ఈయన తన గాత్రాన్ని వినిపించిన బోతున్నారు.
ఇక ఈ సినిమాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు. ఇందులో పవన్ కళ్యాణ్ సరసన నిత్యమీనన్ నటించగా రానా సరసన సంయుక్త మీనన్ నటిస్తున్నారు.ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్ పోస్టర్లు పాటలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకోని సినిమాపై అంచనాలు పెంచాయి. ఈ క్రమంలోనే పవన్ అభిమానులు ఈ సినిమా కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమా విడుదల విషయంలో సరైన క్లారిటీ లేకపోవడంతో అభిమానులు ఈ సినిమా విడుదల తేదీని గురించి క్లారిటీ ఇవ్వాలని కోరుతున్నారు.
