బిగ్ అప్డేట్ : ప్రభాస్ “సలార్” లో ఆ గాసిప్స్ నిజం చేసిన మేకర్స్.!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా చేస్తున్న లేటెస్ట్ పలు చిత్రాల్లో పాన్ ఇండియా వైడ్ కూడా ఎన్నో అంచనాలు ఉన్న భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ “సలార్” కూడా ఒకటి. కేజీఎఫ్ ఫేమ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ ఈ సినిమాని తెరకెక్కిస్తుండగా శృతి హాసన్ అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. ఇక ఈ చిత్రం షూటింగ్ కూడా శరవేగంగా తెరకెక్కిస్తుండగా అభిమానుల్లో ఈరోజు అయితే భారీ అంచనాలు ఉన్నాయి.

ఇక ఈ చిత్రం నుంచి అయితే ఈరోజు ఓ సరికొత్త అప్డేట్ ని రివీల్ చేస్తున్నట్టుగా నిన్న అప్డేట్ ఇవ్వగా దాని కోసం అంతా దాని కోసం ఆసక్తిగా ఎదురు చూసారు. అయితే కొన్నాళ్ల కితం సినిమాపై కొన్ని గాసిప్స్ వినిపించిన సంగతి తెలిసిందే.

ఈ చిత్రంలో మలయాళంకి చెందిన స్టార్ హీరో పృథ్వీ సుకుమారన్ కూడా కనిపించనున్నాడని తెలిసింది. అలాగే పృథ్వీ కూడా ఈ అప్డేట్ అప్పట్లో కన్ఫర్మ్ చేసాడు. కానీ ఫైనల్ గా దీనిని ఇప్పుడు మేకర్స్ నిజం చేశారు. ఈ సినిమాలో తాను పవర్ ఫుల్ రోల్ చేస్తున్నట్టుగా బిగ్ అప్డేట్ తో దీనిని రివీల్ చేసారు.

మరి తన లుక్ నే ఊహించని రేంజ్ లో డిజైన్ చేసి ప్రశాంత్ నీల్ అయితే షాకిచ్చాడు అని చెప్పాలి. ముక్కులో ఒక పుడక లాంటిది మెడలో ఇంకేదో కనిపించడం దీనితో సలార్ లో ఈ నటుడు ఏదో గట్టి రోల్ లోనే కనిపించనున్నాడని దీనితో అర్ధం అవుతుంది. మొత్తానికి అయితే సలార్ నుంచి ఈ అప్డేట్ సినీ వర్గాలను మళ్ళీ షేక్ చేస్తుంది.