వల్లభనేని వంశీ చేసిన తప్పు అదే.. రెండిటికి చెడ్డ రేవడి

vamshi telugu rajyam

   రెండు రోజుల నుండి మీడియాలో ప్రముఖంగా గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ గురించి పుంఖానుపుంఖాలుగా వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం వైసీపీతో సంబంధాలు నెరుపుతున్న వంశీ మరికొద్ది రోజుల్లో ఆ పార్టీ నుండి బయటకు రాబోతున్నాడు అనే వార్తలు గుప్పుమంటున్నాయి. వైసీపీ పార్టీ వంశీని పొమ్మనలేక పొగబెడుతుంది అనే మాటలు వినవస్తున్నాయి. వంశీపై ఇద్దరు నేతలు గన్నవరంలో ఎదురుదాడి చేస్తున్నారు, దుట్టా రామచంద్ర రావు, యార్లగడ్డ వెంకట రావు కలిసి ఎమ్మెల్యే వంశీకి వ్యతిరేకంగా నియోజకవర్గంలో ముందుకి వెళ్తున్నారు. వాళ్ళకి కచ్చితంగా వైసీపీ అధిష్టానం మద్దతు ఉందనేది వంశీ వాదన..

vallabaneni vamsi telugu rajyam

 

  నిజానికి వల్లభనేని ఏమి అమాయకుడు కాదు. మొన్నటి ఎన్నికల్లో తనపై పోటీచేస్తున్న యార్లగడ్డ వెంకట రావును ఇంటికి వెళ్లి బెదిరించిన చరిత్ర వుంది. ఎన్నికల తర్వాత నీకు సన్మానం చేస్తా అంటూ పబ్లిక్ లోనే వల్లభనేని వంశీ మాట్లాడిన వైనం ఎవరు మర్చిపోలేరు. వైసీపీ అధికారంలోకి రావటంతో వంశీ మీద అటాక్ చేయటానికి యార్లగడ్డ వెంకట రావు సిద్ధం అయ్యాడు. ఇందులో భాగంగా వంశీ మీద పాత కేసును ఓపెన్ చేపించారు. దీనితో భయపడిన వంశీ ఉన్నపళంగా వైసీపీకి మద్దతు తెలిపాడు. అదే సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబును, లోకేష్ ను ఇష్టంవచ్చినట్లు తిట్టి మరి వైసీపీలో చేరిపోయాడు.

  వల్లభనేని వంశీకి ఏమి వైసీపీ పార్టీ రెడ్ కార్పెట్ పరవలేదు.. వస్తే రా అంటూ మాత్రమే పైకి చెప్పింది, కానీ లోపల మాత్రం ఇలా పొగబెట్టే పనులు చేస్తుంది. దీనితో వంశీకి ఏమి చేయాలో అర్ధం కావటం. అటు టీడీపీలో ఉండలేక, ఇటు వైసీపీలో ఇమడలేక రెంటికి చెడ్డ రేవడి గా తయారైయ్యాడు. దీనితో మరోసారి వైరాగ్యం ప్రదర్శిస్తూ వంశీ మాట్లాడటం విశేషం. గతంలో టీడీపీ నుండి బయటకు వచ్చే క్రమంలో ఇక రాజకీయాల నుండి సన్యాసం తీసుకోబోతున్న అంటూ మాట్లాడిన వంశీ, తాజాగా మళ్ళీ అదే స్వరం వినిపిస్తున్నాడు. అయితే ఇందులో వైరాగ్యం కంటే కూడా ఒక రకమైన బెదిరింపు ధోరణి వినిపిస్తుంది. మరి ఈ బెదిరింపులకు వైసీపీ ఏమైనా దిగివస్తుందో లేదో చూడాలి..