Varsha Bollamma: శ్రీరామ్ వేణు దర్శకత్వంలో జయంతిటాలీవుడ్ హీరో నితిన్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ తమ్ముడు. తాజాగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలో వర్ష బొల్లమ్మ హీరోయిన్ గా నటించిన విషయం తెలిసిందే. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు, శిరీష్ రెడ్డి నిర్మించారు. ఈ సినిమా నేడు విడుదల అయిన సందర్భంగా విడుదలకు ముందే నిన్నటి రోజున హైదరాబాదులో ఒక ప్రెస్ మీట్ నిర్వహించారు మూవీ మేకర్స్. ఈ ప్రెస్ మీట్ లో భాగంగా హీరోయిన్ వర్ష బొల్లమ్మ మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
తమ్ముడు మూవీలో చాలా మంది మహిళా నటులు ఉన్నారు. ఈ కథలో మిమ్మల్ని ఆకర్షించిన అంశాలు ఏమిటి? అని విలేకరి ప్రశ్నించగా.. హీరోయిన్ వర్ష బొల్లమ్మ స్పందిస్తూ.. ఇందులో అమ్మాయిలు నలుగురే, ‘విజిల్’ సినిమాలో అయితే ఏకంగా ఒక ఫుట్‌బాల్ జట్టు ఉంటుంది కదా. వాళ్ల మధ్యలో నేనొక్కదాన్ని. కానీ తమ్ముడు సినిమాలో నేను పోషించిన గాయత్రి పాత్రని ఇప్పటికీ గుర్తు చేస్తుంటారు. జాను సినిమాలో అయితే ఇంకా చిన్న పాత్ర. సినిమాలో ఎంత మంది నటులు ఉన్నారనేది నేను పట్టించుకోను. నేను చేసే పాత్రలో నటించే అవకాశం ఉందా లేదా? ఆ పాత్రకి న్యాయం చేశానా లేదా? అనేదే ముఖ్యం.
తమ్ముడు మూవీలో నేను చిత్ర అనే యువతిగా కనిపిస్తాను. అడవిలో చిత్రీకరణ చేయాల్సి ఉంటుందని, యాక్షన్ ఉంటుందని ముందే చెప్పారు దర్శక నిర్మాతలు. కథ, పాత్రలు నచ్చడంతో ఎన్ని సవాళ్లు ఎదురైనా నటించాల్సిందే అని సిద్ధమై, రంగంలోకి దిగిపోయాను అని చెప్పుకొచ్చింది. సినిమా షూటింగ్లో ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయి అని అడగగా.. ఇంకో రెండేళ్లవరకూ మారేడుమిల్లి అడవులవైపు అయితే వెళ్లను అని నవ్వుతూ తెలిపింది. దట్టమైన ఆ అడవిలో రాత్రిళ్లలో పాములు, తేళ్లు కనిపించేవి. వాటి మధ్య రాత్రిపూట కాగడాలు పట్టుకుని ఆ వెలుతురులోనే నటించాల్సి వచ్చింది. మేమే కాదు, చిన్న పిల్లలు, పెద్దవాళ్లూ సెట్‌లో ఉండేవారు. సెట్ లో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ నటించాల్సి వచ్చేది. వీలైనంత వరకూ ఏ ఇబ్బంది రాకుండా చూసుకున్నారు నిర్మాతలు అని తెలిపారు వర్ష బొల్లమ్మ.