Thammudu: దిల్ రాజు నిర్మాణంలో ఎన్నో అద్భుతమైన సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. గత రెండు దశాబ్దాలుగా ఇండస్ట్రీలో నిర్మాణ రంగంలో దూసుకుపోతున్న దిల్ రాజు త్వరలోనే తమ్ముడు అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు ఈ సినిమా జులై 4వ తేదీ విడుదల కాబోతుంది. ఇక ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.
ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా దిల్ రాజు సోదరుడు శిరీష్ రెడ్డి ఒక ఇంటర్వ్యూ సందర్భంగా గేమ్ చేంజర్ సినిమా గురించి చేసిన వ్యాఖ్యలు తీవ్రదుమారం రేపాయి గేమ్ చేంజర్ సినిమా వల్ల మా పరువు పోయిందని, ఈ సినిమా ద్వారా మా పరిస్థితి అయిపోయింది అంటూ చాలామంది హేళన చేశారు ఒకవేళ సంక్రాంతికి వస్తున్నాను సినిమా లేకపోతే మా పని అయిపోయి ఉండేదని శిరీష్ తెలిపారు.
ఇక ఈ సినిమా అట్టర్ ఫ్లాప్ కావడంతో కనీసం మాటవరసకైనా హీరో కూడా ఫోన్ చేసి మాట్లాడలేదు అంటూ ఈయన చేసిన వ్యాఖ్యలపై మెగా అభిమానుల నుంచి తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వచ్చింది. ఇక ఈ వ్యాఖ్యల పట్ల పూర్తి డ్యామేజ్ అయిన నేపథ్యంలో దిల్ రాజు స్పందిస్తూ తన సోదరుడి మాటలను కప్పిపుచ్చే ప్రయత్నం చేశారు. అయితే దిల్ రాజు ఎంత కవర్ చేసిన మెగా అభిమానులు మాత్రం శిరీష్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇలా శిరీష్ రామ్ చరణ్ గురించి ఆయన సినిమా గురించి చేసిన వ్యాఖ్యల ప్రభావం తమ్ముడు సినిమాపై పడుతుందని స్పష్టమవుతుంది.నితిన్ నటిస్తున్న తమ్మడు సినిమా కేవలం రెండు రోజుల్లో రిలీజ్ కాబోతుంది. ఆ సినిమా ప్రమోషన్స్ కంటే గేమ్ ఛేంజర్ గురించి సోషల్ మీడియాలో చర్చ నడుస్తుంది. అలాగే దిల్ రాజు, శిరీష్ నిర్మించే తమ్ముడును చూడొద్దని మెగా ఫ్యాన్స్ సోషల్ మీడియాలో పోస్ట్ లు చేస్తున్నారు. అసలే హిట్టు లేక ఇబ్బంది పడుతున్న నితిన్ తమ్మడుపై ఆశలు పెట్టుకుంటే శిరీష్ వాటిని గంగలో కలిపేసాడని ఫీల్ అవుతున్నారు నితిన్ అభిమానులు.