జగన్ ఫేవరెట్ సిటీ వైజాగ్ నుంచి బిగ్ బ్యాడ్ న్యూస్ ?

 

ప్రస్తుతం ఏపీలో విశాఖపట్నం అంటే అంతర్జాతీయ స్థాయిలో మారుమోగుతున్న పేరు. ఒకప్పుడు అక్కడక్కడా విసిరేసినట్లుండే ఇళ్లు, మిణుకుమిణుకుమనే దీపాలు. చీకటి పడితే గాఢాంధకారం. చిన్న జ్వరం వచ్చినా ప్రాణాలను నిలుపుకోలేని దుస్థితి అంతా కలిపి 60 వేల జనాభా ఇదీ ఒకప్పటి విశాఖపట్నం చిత్రం. కానీ నేడు ఆకాశ హర్మ్యాలతో, విద్యుత్ దీపాల ధగధగలతో, స్టీల్‌ సిటీ, సిటీ ఆఫ్‌ డెస్టినీ అన్న బిరుదులతో వెలిగిపోతోంది.. ఇంతటి సౌందర్యాన్ని తనలో పొదుగుకున్న ఈ పట్టణాన్ని ఒక్కసారి అయినా చూడాలనుకోని వారెవరైన ఉంటారా.. ఇక ఇంతటి అందమైన నగరాన్ని మరో వైపు నుండి చూస్తే పేదరికం ఎక్కువ శాతం ఉందట.

ఒక్క విశాఖ సిటీ తప్పించి మొత్తం డెబ్బై శాతం జిల్లా అంతా కూడా అభివృద్ధికి నోచుకోని గ్రామీణ‌ వాతావరణం కనిపిస్తుందట. ఇదే కాకుండా ఏజెన్సీ విశాఖ జిల్లాలోని తొమ్మిది మండలాల‌ను ఆనుకుని ఉందని సర్వేలు చెబుతున్నాయి.. దీన్ని బట్టి చూస్తే విశాఖ జిల్లాను పాతిక శాతం పైగా మన్యం కమ్మేసిందన్నమాట.. అందుకే ఇక్కడ మావోయిస్టుల ప్రాబల్యం ఎక్కువగా ఉందంటున్నారు.. అదీగాక విశాఖ తీవ్రవాదానికి దశాబ్దాల చరిత్ర ఉందని పేర్కొంటున్నారు.. ఇకపోతే నాటి విజయభాస్కరరెడ్డి ప్రభుత్వ హయామంలో మాజీ మంత్రి పసుపులేటి బాలరాజుని మావోయిస్టులు కిడ్నాప్ చేసి కొన్ని రోజుల పాటు అధికారులను ముప్పతిప్పలు పెట్టారు. ఈ సంఘటన తర్వాత కూడా వరసగా టీడీపీ ఎమ్మెల్యేలను హత్య చేశారు.. ఈ హత్యాకాండ 2018 వరకు సాగిందట..

ఆ తర్వాత కొంత సద్దుమణిగిన అప్పుడప్పుడు వారి ఉనికికి చాటుకోవడానికి ఏదో ఒక దాడి చేస్తుంటారు.. ఇలా వారు బలంగానే తమ ఉనికిని చాటుకుంటున్నారు.. ఇదిలా ఉండగా ఏపీలోని పదమూడు జిల్లాలో చూసుకుంటే విశాఖలో ఒక్క చోటే వామ‌పక్ష తీవ్రవాదం బలంగా ఉందని కేంద్ర హోం శాఖ నివేదికలు చెబుతున్నాయి. అయితే కేంద్రం ఏపీకి గత అయిదేళ్ల కాలంలో వీటిని అణచేందుకు దాదాపుగా 96 కోట్ల రూపాయల ఆర్ధిక సాయంగా నిధులను విడుదల చేసినట్లుగా అధికారులు లెక్కలు చెబుతున్నారు. ఉగ్రవాదాన్ని వీడి జనంలోకి వచ్చేవారి కోసం చేసే ఆర్ధిక సహాయం ఈ నిధుల నుండి కేటాయిస్తున్నారు.

ఇలా ఎంత చేసినా కూడా మావోల ఆగడాలు మాత్రం అణగడం లేదు. అదే విధంగా ఏడాది మొత్తంగా అమర వీరుల వారోత్సవాలు, ఇతర కార్యక్రమాలు విశాఖ మన్యం వేదికగా జరుగుతూంటాయని, వీటికి ఆధారాలుగా ఈ మధ్యనే ఆంధ్రా ఒడిషా బోర్డర్ లో మావోల కదలికలను పోలీసులు అమర్చిన సీసీ కెమెరాలు చూపించాయి.. మొత్తానికి విశాఖ చుట్టూ మావోల పడగనీడ బలంగానే ఉందన్న వార్తలు మాత్రం ప్రజాప్రతి నిధులను కలవరపెడుతున్నాయట..