ప్రస్తుతం పదోతరగతి పరీక్షలు జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఓ పరీక్ష కేంద్రం దగ్గరికి ఇన్విజిలేటర్ ఫుల్ గా తాగి తన బాధ్యతలు మరిచాడు. హుజురాబాద్ లోని రాంపూర్ లో ఉన్న జడ్.పి.హెచ్ఎస్ పాఠశాల పీఈటీ టీచర్ ఆమూల రవికుమార్ డ్యూటీలో ఉండగా ఎగ్జామ్ సెంటర్ కు మందు తాగి వచ్చి తూలుతూ కనిపించాడు.
దీంతో ఇన్స్పెక్షన్ విధులకు వచ్చిన జిల్లా విద్యాధికారి జనార్దన్ రావు కి అనుమానం రావడంతో.. వెంటనే పోలీసులను పిలిపించి అక్కడే బ్రీత్ అనలైజర్ పరీక్ష చేయించారు. దీంతో ఆయన తాగిన మద్యం స్థాయి 112 చూపించగా వెంటనే రవి కుమార్ ని సస్పెండ్ చేశారు. అతనితో పాటు సెంటర్ సూపర్డెంట్ ని కూడా నిర్లక్ష్య ధోరణి కారణంగా విధుల నుంచి తొలగించారు. ఇక జనార్దన్ రావు మాట్లాడుతూ విధుల్లో ఇటువంటి నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని అన్నాడు.