పదో తరగతిలో ఏ గ్రేడ్ సాధించిన గౌతమ్.. గర్వంగా ఉందన్న నమ్రత!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు ఇండస్ట్రీలో అగ్రహీరోగా కొనసాగుతూ విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. ఈ క్రమంలోనే మహేష్ బాబు పిల్లలు గౌతమ్ సితార గురించి అందరికీ సుపరిచితమే. మహేష్ బాబు ఏ మాత్రం ఖాళీ సమయం దొరికిన తన పిల్లలతో ఎంజాయ్ చేయడానికి ఇష్టపడతారు. ఇకపోతే ప్రస్తుతం గౌతమ్ సితార నటనపై కాకుండా తమ పూర్తి దృష్టిని చదువుపై ఉంచిన సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే గౌతమ్ తాజాగా పదవ తరగతి పూర్తి చేసుకున్నట్లు నమ్రత వెల్లడించారు.

గౌతమ్ చిరెక్ (CHIREC) ఇంటర్నేషనల్ స్కూల్ లో సీబీఎస్ఈలో తాజాగా పదో తరగతి పూర్తి చేశాడు.తాజాగా పదో తరగతి పరీక్ష ఫలితాలు కూడా వెలువడడంతో నమ్రత ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు. ఈ పరీక్ష ఫలితాలలో తన కుమారుడు గౌతమ్ గ్రేడ్ 10 పాయింట్స్ సంపాదించుకున్నట్లు తెలిపారు. ఈ క్రమంలోనే తన కొడుకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆమె ఒక సుదీర్ఘమైన నోట్ రాసుకొచ్చారు.

గౌతమ్ పదో తరగతి పూర్తి చేసుకొని ఏ గ్రేడ్ సాధించాడు తన ప్రతి ఒక్క సబ్జెక్టులోనూ మంచి ఉత్తీర్ణత సాధించినందుకు చాలా సంతోషంగా, గర్వంగా ఉందనీ నమ్రత తెలియజేశారు. మరొక దశలో కూడా ఇలాంటి చాలెంజ్ తీసుకొని విజయం సాధించాలని ఈమె వెల్లడించారు. మేము ఎల్లప్పుడు నీకు అండగా ఉంటాము నువ్వు మరింత ఎత్తుకు ఎదగాలని ఆశిస్తున్నాను. నీ విధికి నువ్వే రాజు..ఇలాగే మమ్మల్ని ఎల్లప్పుడూ గర్వపడేలా చేయాలి అంటూ ఈమె తన కొడుకు గురించి సుదీర్ఘమైన నోట్ రాసుకొచ్ఛారు. ఈ క్రమంలోనే నమ్రత చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఎంతోమంది మహేష్ అభిమానులు గౌతమ్ కు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.