అలనాటి అందాల తార రజిని పదో తరగతి కూడా పాస్ కాలేదని మీకు తెలుసా?

తెలుగు తమిళ చిత్రాలలో సుమారు 150 సినిమాలకు పైగా నటించి ఒకానొక సమయంలో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు సంపాదించుకున్న అందాల నటి రజనీ గురించి అందరికీ తెలిసిందే. మ‌ణివ‌ణ్ణ‌న్‌కు దర్శకత్వంలో మోహన్ హీరోగా తెరకెక్కిన ‘ఇళ‌మే కాలందు’ ఈ సినిమా ద్వారా తమిళ తెరకు హీరోయిన్ గా పరిచయమైన ఈమె మొదటి సినిమా మంచి విజయాన్ని అందుకోవడంతో అనంతరం ఆమెకు వరుస సినిమా అవకాశాలు వచ్చాయి.ఇలా ఇంగ్లీషులో ఎంతో అనర్గళంగా మాట్లాడుతూ దాదాపు రెండు దశాబ్దాల పాటు ఇండస్ట్రీలో ఉన్నటువంటి రజిని టాలీవుడ్ ఇండస్ట్రీలో దాదాపు స్టార్ హీరోలందరి సరసన నటించారు.

ఈమె తెలుగు ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి సరసన తప్ప మిగతా హీరోలందరితోనూ జత కట్టారు. ఈ విధంగా రెండు దశాబ్దాల పాటు ఇండస్ట్రీలో కొనసాగుతూ ఇంగ్లీష్ ఎంతో అనర్గళంగా మాట్లాడే రజనీ టెన్త్ క్లాస్ కూడా పాస్ అవ్వలేదు. ఈ విషయం తెలిస్తే ప్రతి ఒక్కరు ఎంతో ఆశ్చర్యపోతారు. 9వ తరగతి పూర్తి చేసిన ఈమెను ఓ ప్రొడ‌క్ష‌న్ మేనేజ‌ర్ అమ్మాయి బాగుంద‌ని మ‌ణివ‌ణ్ణ‌న్‌కు చెప్పాడు. అతను ఆమె నాన్నకు కబురు పంపి తనకు సినిమా అవకాశాన్ని కల్పించారు. అయితే ఈ విషయం ఇంట్లో వాళ్ళతో మాట్లాడి కబురు చేస్తానని రజనీ తండ్రి వెళ్లారు.

ఇంటికి వెళ్లి తన కుటుంబ సభ్యులందరితో ఈ విషయాన్ని ప్రస్తావించగా అప్పుడు తన భార్య మాట్లాడుతూ ఏవండి ఆ అమ్మాయికి పెళ్లి చేసి మనం తాతయ్య అమ్మమ్మ అయిన తర్వాత మన కూతురు నటించిన సినిమాని ఆ పిల్లలకు చూపిస్తే ఎంతో బాగుంటుంది. తన తర్వాత సినిమాలలో నటించినా నటించకపోయినా పర్వాలేదు ఈ ఒక్క సినిమాలో నటించడానికి ఒప్పుకుందాం అంటూ రజినినీ ఇండస్ట్రీలోకి పంపించారు.ఇక ఈమె మొదటి సినిమాతోనే మంచి విషయం అందుకోవడంతో దాదాపు కొన్ని సంవత్సరాల పాటు ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా వెలిగారు.ఇక ప్రస్తుతం ఈమె ముగ్గురు పిల్లలకు తల్లిగా మారి వారి ఆలనా పాలనా చూసుకుంటూ ఇండస్ట్రీకు దూరంగా ఉన్నారు.