నీతులు చెప్పే ఆ ఛాన‌ల్ ఇంకా చైనా టిక్ టాక్ ని వ‌ద‌ల్లేదు!

గాల్వానా ఘ‌ర్ష‌ణ‌తో దేశంలో ఎలాంటి ప‌రిస్థితులు నెల కొన్నాయో తెలిసిందే. చైనా పేరెత్తితే ఇప్పుడు భార‌త ప్ర‌జ‌లు మండిప‌డ‌తారు. బ్యాన్ చైనా అంటూ పెద్ద ఉద్య‌మానికి తెర లేపారు. చైనా వ‌స్తువుల‌ను, యాప్ ల‌ను బ్యాన్ చేయాల‌ని పెద్ద ఎత్తున నిర‌స‌న చేప‌ట్టి స‌క్సెస్ చేసారు. ప్ర‌జ‌ల కాంక్ష మేర‌కు ప్ర‌భుత్వం వెంట‌నే 59 యాప్ ల‌ను బ్యాన్ చేసింది. ఇంకా చైనాని ఎన్ని ర‌కాలుగా దెబ్బ‌కొట్టాలో అన్ని ర‌కాలుగాను కొట్టే ప్ర‌య‌త్నం చేసింది. భార‌త్ లో ఒక్క టిక్ టాక్ ని బ్యాన్ చేయ‌డం వ‌ల్లే 45 వేల కోట్ల న‌ష్టం వాటిల్లింది. ఈ న‌ష్టంపై చైనా మేక‌పోతు గాంభీర్యాన్ని ప్ర‌ద‌ర్శించింది. లోలోప‌ల చైనా ఈ న‌ష్టంతో ఎంత‌గా ఉబికిపోయి ఉంటుందో ప్ర‌జ‌లు ఊహించ‌గ‌ల‌రు.

భార‌త్ లో అత్యంత వేగంగా వృద్ధిలోకి వ‌చ్చిన యాప్ అది. ప‌ట్ట‌ణం నుంచి ప‌ల్లె వ‌ర‌కూ ప్ర‌తీ ఒక్క‌రికి తెలిసిన యాప్ గా చ‌రిత్ర‌కెక్కింది. ఒక్క ఇండియా నుంచి బోలెడంత ఆదాయాన్ని చైనా అర్జించింది. ఆదేశంతో వార్ నేప‌థ్యంలో ఆ యాప్ పై భారీగానే దెబ్బ కొట్టింది భార‌త్. అయితే నీతులు..సూక్తులు వ‌ల్లించే ఓ తెలుగు న్యూస్ ఛాన‌ల్ ఇంకా టిక్ టాక్ పేరిట నిర్వ‌హిస్తోన్న ప్రోగ్రామ్ ని మాత్రం ర‌ద్దు చేయ‌లేదు. చైనా-భార‌త్ యుద్ధం గురించి సైనిక వేశాలు వేసి మ‌రీ ప్రోగ్రామ్ లు చేసిన ఆ ఛాన‌ల్ యధేశ్చ‌గా ఇంకా టిక్ టాక్ పేరుతో ప్రోగ్రామ్ చేస్తోంది. కాన్సెప్ట్ ప్రోగ్రామ్ లో ఎలాంటి త‌ప్పు లేదు. కానీ టిక్ టాక్ పేరుతో నిర్వ‌హిచ‌డంపైనే సోష‌ల్ మీడియాలో అభ్యంత‌రం వ్య‌క్తం అవుతుంది.

త‌క్ష‌ణం ఛాన‌ల్ ప్రోగ్రామ్ పేరును టిక్ టాక్ గా తొల‌గించి మ‌రో పేరు పెట్టాల‌ని…అదీ భార‌త టెక్నాల‌జీ రూపొందించే యాప్ పేరు పెట్టాల‌ని డిమాండ్ చేస్తున్నారు. కానీ యాజ‌మాన్యం మాత్రం రేటింగ్ కోసం..సంపాద‌న కోసం దేశ ప్ర‌తిష్ట‌నే ప‌ణంగా పెడుతూనే ఉంది. చివ‌రికి సోమ‌వారం చైనా తోక ముడిచి గుడారాలు స‌ర్దేసి వెన‌క్కి త‌గ్గినా ఆఛాన‌ల్ ఇంకా టిక్ టాక్ ని మాత్రం వ‌దిలిపెట్టేలేదు. సాగ‌దీసీ..లాగ‌దీసి టిక్ టాక్ ని జ‌నాల మీద రుద్దుతున్నారు. చైనా యాప్ ని ఇంత‌గా రం  చేయ‌డం దేశ ద్రోహం కాక ఏమ‌నాలంటూ సోష‌ల్ మీడియా జ‌నం మండిప‌డుతున్నారు.