పోలవరం పై తెలుగు పత్రికల పైత్యం !

Polavaram Project

1941 ప్రారంభంలో, అప్పటి నీటిపారుదల చీఫ్ ఇంజనీర్ అయిన శ్రీ ఎల్. వెంకటకృష్ణ అయ్యర్, పోలవరం సమీపంలో ఉన్న ప్రధాన గోదావరి నది మీద డ్యామ్ కోసం ప్రతిపాదనను పెట్టారు. సుదీర్ఘంగా దీని సాధ్యాసాధ్యాలు పరిశీలించిన తరువాత, రామపాదసగర్ ప్రాజెక్ట్ గా 1951 లో ఖరారు చేశారు.

Polavaram

అప్పటినుండి 2004 వరకు ఈ ప్రాజెక్ట్ ను తర్వాత వచ్చిన ప్రభుత్వాలు అన్ని అటకెక్కించాయి. వైయస్ రాజశేఖర్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు మూడు సంవత్సరాలకు ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అనుమతులన్నీ లభించడంతోపాటు పోలవరం కుడి ఎడం కాలువలు కూడా దాదాపుగా పూర్తయ్యాయి.

రాజశేఖర్ రెడ్డి అకాల మరణంతో మల్లి ఈ ప్రాజెక్టుకు గడ్డు కలం ఎదురైంది. రాష్ట్ర విభజన తర్వాత అధికారం చేపట్టిన చంద్ర బాబు నాయుడు ప్రభుత్వం పోలవరం మీద నిర్మించే హైడెల్ పవర్ ప్రాజెక్ట్ ఖర్చు రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని కేంద్రానికి తెలిపారు. ఆ విధానాన్నే ఇప్పుడు వైయస్ జగన్ కొనసాగిస్తున్నారు.

అయితే మన తెలుగు పత్రికలవారికి కొన్ని అంశాలు అధికారంలో ఎవరున్నారనే దాన్నిబట్టి వేరేగా అర్థమయ్యేటట్లు ఉన్నాయి. విద్యుత్ కేంద్రానికి కేంద్ర సహాయం అవసరం లేదు మేమే నిర్మిస్తామని చంద్రబాబు గారి నిర్ణయం. చాలా సహేతుకమైన నిర్ణయం. ఎందుకంటే కేంద్ర నిధులతో జలవిద్యుత్ కేంద్రాన్ని నిర్మిస్తే ఉత్పత్తి అయ్యే విద్యుత్ పంపిణీ కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగా ఉంటుంది. రాష్ట్ర నిధులతో నిర్మిస్తే దాని పంపిణీ రాష్ట్ర పరిధిలో ఉంటుంది. అలాంటప్పుడు ఇప్పుడు ఆ అంశాన్ని వక్రీకరించి ప్రస్తావించాల్సిన అవసరం ఏంటో అర్థం కావటం లేదు.