AP: జగన్ పెద్ద ఎదవ… పుట్టినప్పుడే పీక పిసికేస్తే దరిద్రం పోయేది… ఫైర్ అయిన రేణుక చౌదరి!

AP: వైయస్ జగన్మోహన్ రెడ్డి పై ప్రస్తుతం తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన సాక్షి ఛానల్ లో ఒక న్యూస్ డిబేట్లో భాగంగా సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావు మాట్లాడుతూ అమరావతి మహిళలను వేశ్యలు అంటూ మాట్లాడారు. అయితే ఈ వ్యాఖ్యలను తప్పుగా వక్రీకరించడంతో మహిళలు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేయడమే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా సాక్షి కార్యాలయాలను ముట్టడిస్తున్నారు.

ఇలా మహిళలను కించపరుస్తూ మాట్లాడిన నేపథ్యంలో కొమ్మినేని శ్రీనివాసరావు పై కేసులు నమోదు చేసి తనని అరెస్టు చేయడం జరిగింది. ఇలా సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు మాట్లాడిన ఈ వ్యాఖ్యలపై ఎంతో మంది వైయస్ జగన్మోహన్ రెడ్డిని కూడా తీవ్రస్థాయిలో తప్పుపడుతున్నారు. ఈ క్రమంలోనే తెలంగాణ ఎంపీ కాంగ్రెస్ సీనియర్ నేత రేణుక చౌదరి కూడా ఒక న్యూస్ డిబేట్ లో ఈ విషయం గురించి మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి పై విమర్శలు కురిపించారు.

ఈ సందర్భంగా రేణుక చౌదరి మాట్లాడుతూ జగన్ పెద్ద ఎదవని ఎద్దేవా చేశారు.అంతటితో ఆగకుండా.. జగన్ పుట్టినప్పుడే విజయమ్మ తన పీక పిసికి చంపేసి ఉంటే ఒక దరిద్రం పోయేదని తీవ్రస్థాయిలో విమర్శలు కురిపించారు. జగన్మోహన్ రెడ్డికి ముందు నుంచి కూడా అమరావతి అంటే ఇష్టం లేదని అందుకే మూడు రాజధానుల ప్రస్తావన తెరపైకి తీసుకు వచ్చి ప్రజలను తప్పుదోవ పట్టించారని మండిపడ్డారు. ఇలా వైయస్ జగన్మోహన్ రెడ్డి గురించి ఒక న్యూస్ డిబేట్లో రేణుక చౌదరి చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనంగా మారాయి.